News June 16, 2024

శ్రీవారి దర్శనానికి 30 గంటలు

image

వేసవి సెలవులు ముగిసినా తిరుమలకు భక్తులు పోటెత్తుతూనే ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన వారితో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. నందకం అతిథి గృహం వరకు భక్తులు క్యూలైన్లలో వేచిఉన్నారు. దీంతో టోకెన్లు లేని వారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. అటు నిన్న 82వేల మంది శ్రీనివాసుడిని దర్శించుకున్నారు.

Similar News

News April 3, 2026

నాశనం చేయాలని చూస్తే శాసనం చేశాం: CBN

image

AP: అమరావతి రాజధానిని YCP నాశనం చేయాలని చూస్తే తాము శాసనం చేశామని CM చంద్రబాబు అన్నారు. ‘అమరావతి చట్టబద్ధత బిల్లుతో గుర్తింపు, గౌరవం దక్కాయి. VJA-GNT మధ్య రాజధానికి అనుకూలమని 46% మంది ప్రజలు చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ TDP సిద్ధాంతం. రాజధాని ఉంటేనే APకి భవిష్యత్ ఉంటుందని సంకల్పించి రాష్ట్రానికి మధ్యలో ఏర్పాటు చేశాం. నాకున్న అనుభవం వల్ల TGలోని 7 మండలాలను విలీనం చేయించాం’ అని తెలిపారు.

News April 3, 2026

మెగా మేనల్లుడి కొత్త సినిమా.. పోస్టర్ అదుర్స్

image

సుప్రీమ్ హీరో సాయి దుర్గతేజ్ తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ‘సీక్రెట్స్ ఆఫ్ ది ఏజెస్.. పవర్ బియాండ్ ఇమాజినేషన్’ అంటూ తన 19వ సినిమా పోస్టర్‌ను విడుదల చేయగా ఆకట్టుకుంటోంది. కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ డైరెక్టర్లు సుజిత్, సందీప్ సంయుక్తంగా తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సాయి తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

News April 3, 2026

నిహారిక ‘రాకాస’ రివ్యూ&రేటింగ్

image

కోటలోని బ్రహ్మరాక్షసుడి బలికి చిక్కిన హీరో బయటపడటానికి ఏం చేశాడనేదే ‘రాకాస’ స్టోరీ. ఎప్పటిలాగే సంగీత్ కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. ఫస్టాఫ్‌ స్లోగా సాగుతుంది. సెకండాఫ్‌లో కొన్ని ట్విస్టులు ఆకట్టుకుంటాయి. నిహారిక ప్రొడక్షన్ వ్యాల్యూస్, అనుదీప్ దేవ్ BGM ఫర్వాలేదు. లాజిక్‌లు మిస్సవ్వడం, రొటీన్ హారర్ కామెడీ ఫీల్ కలుగుతుంది. క్లైమాక్స్‌లో డైరెక్టర్ మానస శర్మ తడబడ్డారు.
రేటింగ్: 2.25/5