News March 30, 2025
కొత్త రేషన్ కార్డుల్లో 30 లక్షల మంది: సీఎస్

TG: కొత్తగా రేషన్ కార్డుల్లో 30లక్షల మందిని చేర్చనున్నామని సీఎస్ శాంతికుమారి చెప్పారు. హుజూర్ నగర్‌లో జరిగిన సన్నబియ్యం పథకం ప్రారంభోత్సవంలో ఆమె మాట్లాడారు. సన్నబియ్యం పంపిణీతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2,800 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు. కొత్తగా 10 లక్షల రేషన్ కార్డులు జారీ కానున్నట్లు వెల్లడించారు.
Similar News
News April 1, 2025
CBN, లోకేశ్, పవన్‌పై వైసీపీ ‘ఏప్రిల్ ఫూల్’ ట్వీట్

AP: ఏప్రిల్ ఫస్ట్ సందర్భంగా చంద్రబాబుకు డబ్బు కట్ట, లోకేశ్‌కు పాల డబ్బా, పవన్‌కు రిమోట్‌ను సింబల్స్‌గా పెట్టి వైసీపీ సెటైరికల్ ట్వీట్ చేసింది. ‘వెరీ ఫేమస్ పాత్రలు.. స్కామర్ బాబు, పప్పు లోకేశ్, పవన్ కంట్రోల్. ఇప్పుడు మీ సమీపంలోని హెరిటేజ్ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. ఏప్రిల్ ఫూల్ కోడ్‌ను ఉపయోగించి 50 శాతం డిస్కౌంట్ పొందండి. లేదా TDPFools కోడ్‌తో 100% తగ్గింపును పొందండి’ అని రాసుకొచ్చింది.
News April 1, 2025
దోమలు ఎక్కువగా ఎవరిని కుడతాయంటే?

దోమలు అందరిపై ఒకేలా దాడి చేయవు. ఎందుకంటే వాటికీ ఓ టేస్ట్ ఉంది. దోమలు ‘O’ గ్రూప్ రక్తాన్ని ఎక్కువగా ఇష్టపడతాయని ఓ పరిశోధనలో తేలింది. అందుకే O గ్రూప్ వ్యక్తులను ఎక్కువగా, A రకం వాళ్లని తక్కువగా కుడతాయి. అలాగే, చర్మంపై ఉండే బ్యాక్టీరియా కూడా కీలకం. అవి చెమటతో కలిసినప్పుడు విడుదల చేసే వాసన దోమలను ఆకర్షించడమో, తిప్పికొట్టడమో చేస్తుంటాయి. గర్భిణులు, వ్యాయామం చేసే వారిపై దోమల ప్రభావం ఎక్కువ అని తేలింది.
News April 1, 2025
400 ఎకరాలను న్యాయపరంగానే తీసుకుంటున్నాం: భట్టి

TG: HCU భూములను ప్రభుత్వం లాక్కుంటున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని Dy.CM భట్టి విక్రమార్క ఖండించారు. విద్యార్థులు రాజకీయ ప్రభావానికి లోను కావొద్దని సూచించారు. ‘2004లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఈ 400 ఎకరాలకు బదులుగా 397 ఎకరాలను HCUకి మరో చోట కేటాయించింది. ఈ భూమిని న్యాయపరంగానే తీసుకుంటున్నాం. దీనిపై బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారం మానుకోవాలి’ అని సూచించారు.