News October 30, 2025
ఇంజినీరింగ్ అర్హతతో 30 పోస్టులు

నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్(NEEPCO) 30 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీటెక్, బీఈ ఉత్తీర్ణతతో పాటు GATE-2025 అర్హత సాధించిన అభ్యర్థులు నవంబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, గేట్ స్కోరు , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://neepco.co.in
Similar News
News October 30, 2025
ఆ విద్యార్థుల అకౌంట్లలో నగదు జమ: అడ్లూరి

TG: ఓవర్సీస్ స్కాలర్‌షిప్ స్కీం కింద ఒక్కో విద్యార్థికి ₹20 లక్షల చొప్పున 2,288 మందికి ₹304 కోట్లు <<18143119>>విడుదల<<>> చేసినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. 2022 నుంచి ఇప్పటివరకు ₹463 కోట్లు రిలీజ్ చేసినట్లు చెప్పారు. దీంతో విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రాష్ట్ర విద్యార్థులకు ఉపశమనం లభిస్తుందన్నారు. అర్హత కలిగిన విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా నగదు జమ అవుతుందని తెలిపారు.
News October 30, 2025
చైనా అంతరిక్ష యాత్రకు పాక్ ఆస్ట్రోనాట్!

చైనా, పాకిస్థాన్ దోస్తీ కొత్త పుంతలు తొక్కుతోంది. తమ టియాంగోంగ్ స్పేస్ స్టేషన్‌కు చేపట్టే స్వల్పకాలిక అంతరిక్ష యాత్రలో పాకిస్థానీ ఆస్ట్రోనాట్‌కు అవకాశం కల్పిస్తామని చైనా ప్రకటించింది. ఎంపికైన పాక్ వ్యోమగామికి తమ ఆస్ట్రోనాట్లతో పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ట్రైనింగ్ ప్రోగ్రామ్, మిషన్ టైమ్‌లైన్‌ను ఖరారు చేసే పనిలో చైనా, పాక్ స్పేస్ ఏజెన్సీలు ఉన్నాయని అక్కడి మీడియా వెల్లడించింది.
News October 30, 2025
సుప్రీంకోర్టు కొత్త సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్

సుప్రీంకోర్టు కొత్త సీజేఐగా జస్టిస్ <<18087163>>సూర్యకాంత్<<>>ను నియమిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుత CJI గవాయ్ చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నవంబర్ 24న బాధ్యతలు స్వీకరించనున్నారు. 2027 ఫిబ్రవరి వరకు కొనసాగుతారు. హరియాణా నుంచి ఎన్నికైన తొలి సీజేఐగా సూర్యకాంత్ నిలవనున్నారు.


