News April 19, 2024
30% చక్కెరను తగ్గించాం: నెస్లే
పిల్లలకు ఇచ్చే ఆహార ఉత్పత్తుల్లో 3గ్రాములు అదనంగా చక్కెర వినియోగిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై నెస్లే ఇండియా స్పందించింది. భారత్‌లో తయారు చేస్తున్నఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత 5ఏళ్లలో 30% తగ్గించినట్లు పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దక్షిణాసియా దేశాలు, వెనకబడిన ఆఫ్రికా దేశాల్లో నెస్లే నుంచి వచ్చే బేబీ ప్రొడక్టుల్లో చక్కెర పర్సంటేజ్ ఎక్కువగా ఉంటోందని ఇటీవల ఆరోపణలు వచ్చాయి.
Similar News
News November 19, 2024
2019 VS 2024: 7 రెట్లు ఎక్కువ డబ్బు సీజ్ చేసిన ECI
తాజా ఎన్నికల సీజన్లో రూ.1000 కోట్లకు పైగా డబ్బును సీజ్ చేసినట్టు ECI తెలిపింది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ కలుపుకొని రూ.858 కోట్లు స్వాధీనం చేసుకున్నామంది. 2019తో పోలిస్తే ఈ విలువ 7 రెట్లు ఎక్కువని తెలిపింది. మహారాష్ట్రలో రూ.660 కోట్లు, ఝార్ఖండ్‌లో రూ.198 కోట్లు, బై పోల్స్ జరిగే రాష్ట్రాల్లో రూ.223 కోట్లమేర సీజ్ చేశామని వెల్లడించింది. NOV 20న తుదిదశ పోలింగ్ ఉండటంతో నిఘా ఇంకా పెంచుతామని పేర్కొంది.
News November 19, 2024
పిల్లలను పెంచేందుకు పెరుగుతోన్న ఖర్చులు
దేశంలో పిల్లల పెంపకం ఖర్చు గణనీయంగా పెరుగుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు ముఖ్యంగా ఎదుర్కొంటున్న ఖర్చులు ఇవే. పిల్లల ఆహారానికి ఏడాదికి రూ.35వేలు, బట్టలకు రూ.24 వేలు, ఆరోగ్య సంరక్షణకు రూ.20వేలు, విద్యకు రూ. 5వేల నుంచి రూ.లక్ష, డిగ్రీ చదివే పిల్లలుంటే రూ.5లక్షల వరకు, ఆటవస్తువులు & ఇతర అవసరాలకు రూ.25వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ ఖర్చులు ఏటా పెరుగుతూనే ఉంటాయి.
News November 19, 2024
వరంగల్‌కు వరాల జల్లు (1/2)
ప్రజాపాలన విజయోత్సవ వేడుకల వేళ ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాపై వరాల జల్లు కురిపించింది.
* వరంగల్ మహానగర అభివృద్ధికి రూ.4962.47కోట్లు
* వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ.4,170కోట్లు
* కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌కు రూ.160.92కోట్లు
* టెక్స్టైల్ పార్కులో రోడ్లు, స్కూల్స్, సదుపాయాలకు రూ.33.60కోట్లు
* పార్క్‌కు భూములిచ్చిన రైతులకు 863ఇళ్లు, రూ.43.15 కోట్ల పరిహారం