News September 2, 2025
30 ఏళ్ల జర్నీ.. చంద్రబాబు స్పెషల్ పోస్ట్

AP: తొలిసారి AP CMగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు పూర్తైన సందర్భంగా చంద్రబాబు Xలో స్పెషల్ పోస్ట్ చేశారు. ‘ముప్ఫై ఏళ్ల ప్రయాణం. ప్రజలకు సేవ చేసేందుకు నేను 30 రెట్లు కృతనిశ్చయంతో ఉన్నాను. నాకు అభినందనలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్, Dy.CM పవన్ కళ్యాణ్ తదితరులకు కృతజ్ఞతలు. నా జర్నీలో భాగమై స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా నన్ను నడిపిస్తున్న రాష్ట్ర ప్రజలకు ఈ మైల్‌స్టోన్ అంకితం’ అని పేర్కొన్నారు.
Similar News
News January 30, 2026
ఒక్క రోజే రూ.10వేలు తగ్గిన కేజీ వెండి ధర

వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న వెండి ధర ఇవాళ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో KG సిల్వర్ రేటు రూ.10వేలు పతనమై రూ.4,15,000కు చేరింది. కాగా నిన్న ఒక్క రోజే కేజీ వెండి ధర రూ.25వేలు పెరిగిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. అటు బంగారం ధరలు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి.
News January 30, 2026
NCERTలో 173 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

<
News January 30, 2026
టమాటా రైతుల ఆవేదన.. కిలో రూపాయి కూడా లేదు!

AP: టమాటా ధరలు రైతులకు కన్నీళ్లు మిగిలిస్తున్నాయి. 3నెలల క్రితం కిలో రూ.60 పలికిన టమాటాకి ఇప్పుడు రూపాయి కూడా రావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లె మార్కెట్లో రెండు వారాల క్రితం కిలో రూ.15 పలికిన నాణ్యమైన రకం ఇప్పుడు రూ.7 కూడా పడట్లేదని వాపోతున్నారు. మూడో రకమైతే రూపాయి కూడా రావట్లేదని చెబుతున్నారు. కోత కూలీ, ప్రయాణ ఖర్చులు కూడా రావట్లేదని కొందరు రైతులు పంటను వదిలేస్తున్నారు.


