News August 10, 2024
30 ఏళ్లు ఆమె నరకం చూపించింది: దువ్వాడ శ్రీనివాస్

AP: దువ్వాడ వాణితో రెండేళ్ల నుంచి రాజకీయ, కుటుంబ ఆధిపత్య <<13820134>>పోరు <<>>నడుస్తుందని YCP MLC దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. ‘రెండేళ్లుగా విడిగానే ఉంటున్నా. నా ఇంటిపై దాడి చేసిన వాళ్లు నా భార్య, కుమార్తెలే కాదు. పరమ శత్రువులు. ఏ జన్మలో చేసిన పాపమో ఆమెను పెళ్లాడా. 30 ఏళ్లు నరకం చూపించింది. ఇప్పుడే సంతోషంగా ఉంటున్నా. మళ్లీ రౌడీమూకలతో నాపై దాడికి వచ్చింది. ఆమె నుంచి రక్షించాలి’ అని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News January 29, 2026
భారత్ రానున్న బంగ్లాదేశ్ ప్లేయర్లు

ఢిల్లీ వేదికగా FEB 2-14 వరకు ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్ జరగనుంది. ఈ టోర్నీలో ఇద్దరు బంగ్లాదేశ్ రైఫిల్ షూటర్లు పాల్గొంటారని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(NRAI) కార్యదర్శి పవన్ సింగ్ పేర్కొన్నారు. ’21ఏళ్ల షైరా, 26ఏళ్ల ఇస్లామ్కు వీసాలు ఇచ్చాం. వాళ్లు కచ్చితంగా పాల్గొంటారు’ అని తెలిపారు. భారత్ వెళ్లబోమని T20WC నుంచి తప్పుకున్న బంగ్లా.. ఢిల్లీకి షూటర్లను పంపేందుకు సిద్ధమవడం గమనార్హం.
News January 29, 2026
ఆనందం డబుల్.. గ్రూప్-2 కొట్టిన భార్యాభర్తలు

AP: తాజా గ్రూప్-2 <<18979288>>ఫలితాల్లో<<>> అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన భార్యాభర్తలు సత్తా చాటారు. భార్య వినీత సబ్ రిజిస్ట్రార్గా, భర్త హేమచంద్ర ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యారు. HYDలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న సమయంలో నోటిఫికేషన్ రావడంతో ఉద్యోగాలకు రాజీనామా చేసి ప్రిపేర్ అయ్యారు. ఇద్దరూ జాబ్ కొట్టడంతో వారింట ఆనందం రెట్టింపయ్యింది. కాగా 891 మంది గ్రూప్-2 ఉద్యోగాలు సాధించారు.
News January 29, 2026
డెలివరీకి సిద్ధంగా ఉన్నారా?

ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవగానే ఇంట్లోకి సంతోషం వచ్చేస్తుంది. ఈ సంతోషం కలకాలం ఉండాలంటే సరైన ఆర్థిక ప్రణాళిక ఉండాలంటున్నారు నిపుణులు. ప్రెగ్నెన్సీ, డెలివరీ సమయాల్లో ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసుకోవాలి. బిడ్డ పుట్టిన తర్వాత ఏడాది పాటు దుస్తులు, ఆహారం, వస్తువులు, మందులు ఇలా అన్నింటికీ సరిపడా పొదుపు చేసుకోవాలి. ఏది అవసరమో.. ఏది కాదో చూసి కొనుక్కోవాలి. ఎమర్జెన్సీ కోసం కాస్త డబ్బు దాచి ఉంచాలి.


