News March 29, 2025
30 తరాలైన YCP గెలవదు: ఆదినారాయణ రెడ్డి

జమ్మలమడుగు MLA ఆదినారాయణ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కాశినాయన ఆశ్రమానికి 23 హెక్టార్ల స్థలం కావాలని 2023లో నేను లేఖ రాస్తే YCP ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వంలో మరోసారి కేంద్ర అటవీ శాఖ మంత్రికి మేము రిక్వెస్ట్ చేస్తే 13ఎకరాలు ఇస్తామని ఆయన చెప్పారు. డైనోసార్‌లాగా వైసీపీ కాలగర్భంలో కలిసిపోయింది. 30ఏళ్లు కాదు కదా.. 30 తరాలైన వైసీపీ గెలవదు’ అని ఢిల్లీలో ఎమ్మెల్యే అన్నారు.
Similar News
News April 2, 2025
పోరుమామిళ్ల: యువతి ఆత్మహత్య

పెళ్లి కావడంలేదని యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పోరుమామిళ్ల మండలంలో జరిగింది. పోరుమామిళ్ల ఎస్ఐ కొండారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. తిరువెంగలాపురంలో రామ తులసి(25) అనే యువతి పెళ్లి కావడంలేదని మనస్థాపంతో మంగళవారం ఉరేసుకుంది. మృతదేహాన్ని పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News April 2, 2025
ఇడుపులపాయ: IIITల్లో కొత్త కోర్సులు ..!

రాబోయే విద్యాసంవత్సరం నుంచి ఏపీలోని 4 IIITల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషిన్ లెర్నింగ్ కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు RGUKT రిజిస్ట్రార్ ఆచార్య అమరేంద్ర కుమార్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ విద్యార్థులకు మైనర్ డిగ్రీ కింద క్వాంటమ్ టెక్నాలజీ కోర్సు అందుబాటులోకి రానుందన్నారు. ఇటీవల సమావేశమైన RGUKT 72వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
News April 2, 2025
పులివెందులలో యువకుల మధ్య ఘర్షణ

పులివెందుల పట్టణంలోని భాకరాపురంలో మంగళవారం రాత్రి యువకుల మధ్య ఘర్షణ జరిగింది. కొద్దిసేపు యువకులంతా కొట్టుకోవడంతో ప్రజలు భయాందోళన చెందారు. విషయం తెలుసుకున్న అర్బన్ సీఐ నరసింహులు అక్కడికి చేరుకుని యువకులను చెదరగొట్టారు. పట్టణంలో యువకులు మత్తు పానీయాలకు అలవాటు పడి రాత్రి సమయాల్లో గొడవకు పడడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.