News March 28, 2024
30 నుంచి భద్రాచలం-విశాఖకు లహరి నాన్ ఏసీ బస్సులు
భద్రాచలం-విశాఖపట్నంకి లహరి నాన్ ఏసీ బస్సులను ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు భద్రాచలం DM రామారావు తెలిపారు. శనివారం భద్రాచలం నుంచి ఉదయం 9 గంటలకు, రాత్రి 9 గంటలకు లహరి బస్సు బయలుదేరుతుందన్నారు. విశాఖపట్నం-భద్రాచలానికి ఉదయం 8 గంటలకు, రాత్రి 8:45 గంటలకు బస్సు ఉంటుందన్నారు.
Similar News
News November 24, 2024
ఖమ్మం: సర్వే డేటా ఎంట్రీ కీలకం: భట్టి
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరి దశకు చేరుకున్నదని, సర్వే డేటా ఎంట్రీ చాలా కీలకమైందని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భట్టి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో 5,68,493 ఇండ్లను సర్వే కోసం గుర్తించామని, ఈనెల 23 నాటికి మొత్తం 4,78,868 ఇండ్ల సర్వే పూర్తయిందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
News November 24, 2024
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే మృతి.. నేపథ్యమిదే..
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య(70)<<14693570>> తెల్లవారుజామున కన్నుమూశారు<<>>. ఆయన రెండు సార్లు (1983,94) సీపీఐ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ లభించకపోవడంతో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) నుంచి పోటీ చేసి ఓడారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరినా టికెట్ దక్కకపోడవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
News November 24, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నేటి ముఖ్యంశాలు
> ఖమ్మం: ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం> > జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన > > మంత్రి సీతక్క పర్యటన > > పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రాక > > > ఆర్యవైశ్యుల వన సమారాధన > > > ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పర్యటన > ఖమ్మం: రామ సహాయం రఘురాం రెడ్డి పర్యటన > > నేడు నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమం వాయిదా