News April 10, 2024

30 నెలల్లో నెల్లూరు ఎయిర్‌పోర్ట్ కడతాం: VSR

image

నెల్లూరు జిల్లా ఎయిర్‌పోర్ట్ విషయమై ఎంపీ విజయసాయి రెడ్డి(VSR) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబు దగాకోరు హామీల్లో నెల్లూరు ఎయిర్ పోర్టు ఒకటి. 2018లో దగదర్తి వద్ద ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభించి 2020 నాటికి పూర్తి చేస్తామని నమ్మబలికారు. నేను ప్రామిస్ చేస్తున్నా. జగన్ సీఎంగా మరోసారి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎయిర్‌పోర్టు పనులు మొదలుపెట్టి 30 నెలల్లో పూర్తి చేస్తాం’ అని ఆయన ట్వీట్ చేశారు.

Similar News

News December 18, 2025

నెల్లూరు: 20న జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్

image

పల్లెపాడు డైట్ కాలేజీలో ఈనెల 20న జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు నెల్లూరు డీఈవో ఆర్.బాలాజీ రావు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 38 మండలాల నుంచి గ్రూప్ కేటగిరి, విద్యార్థి కేటగిరి, ఉపాధ్యాయ కేటగిరి ప్రాజెక్టులకు సంబంధించి 114 ప్రదర్శనలు జరుగుతాయన్నారు. ఇక్కడ గెలుపొందిన వారు ఈనెల 23, 24వ తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.

News December 18, 2025

నెల్లూరు కలెక్టర్ బాగా పనిచేస్తున్నారు: CM

image

నెల్లూరు జిల్లాలో ‘ఛాంపియన్ రైతు’కు కలెక్టర్ హిమాన్షు శుక్లా శ్రీకారం చుట్టారు. ప్రతి గ్రామంలోనూ ఓ ఛాంపియన్ ఫార్మర్‌ను ఎంపిక చేసి మిగతా వారికి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. దీంతో కలెక్టర్‌ను CM చంద్రబాబు ప్రశంసించారు. ‘అమరావతిలోనే ఉండాలని హిమాన్షును కోరా. ఓ జిల్లాలో ఇంపాక్ట్ కలిగిస్తానని కలెక్టర్‌గా వెళ్లారు. చక్కగా పనిచేస్తున్నారు. ఇతర కలెక్టర్లు హిమాన్షును ఆదర్శంగా తీసుకోవాలి’ అని CM సూచించారు.

News December 18, 2025

టాప్-2లో నెల్లూరు జిల్లా..!

image

నెల్లూరు జిల్లాకు 2025-26 GDDP టార్గెట్ రూ.92,641కోట్లు కాగా ఇప్పటి వరకు రూ.36,766కోట్లతో రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ లక్ష్యాల సాధనలో జిల్లాకు 79/100 మార్కులొచ్చాయి. 2025-26లో రూ.2952కోట్ల పాల దిగుబడులతో జిల్లా 2వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 97వేల ఇళ్లను మంజూరు చేయగా 68వేలు గ్రౌండింగ్ అయ్యాయి. 43వేల ఇళ్లను పూర్తి చేశామంటూ జిల్లా వివరాలను CMకు కలెక్టర్ హిమాన్షు శుక్లా వివరించారు.