News March 31, 2024

30 వేల ఉద్యోగాలు ఇచ్చాం: మంత్రి కోమటిరెడ్డి

image

మూడు నెలల్లో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నామని గత ప్రభుత్వం ఎప్పుడైనా ఇచ్చిందా అని బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. కేటీఆర్ అధికారం కోల్పోయిన బాధతో ఏవేవో మాట్లాడుతున్నారని విమర్శించారు. కరువు యాత్రల పేరుతో కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని దుయ్యబట్టారు.

Similar News

News April 23, 2025

NLG: బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు

image

బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. వచ్చే నెల 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 130 కాలేజీలు బాలురకు 127 కాలేజీలు బాలికలకు ఉన్నాయి. మరిన్ని వివరాలకు https://mjpabcwreis.cgg.gov.in/ TSMJBCWEB/లేదా 040-23328266 నంబర్‌ను సంప్రదించగలరు.

News April 23, 2025

NLG: కొనసాగుతున్న ఓపెన్ ఇంటర్ పరీక్షలు

image

నల్గొండ జిల్లాలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం నిర్వహించిన పొలిటికల్ సైన్స్ పరీక్షకు 1454 మంది విద్యార్థులకు గాను,1238 మంది పరీక్ష కు హాజరు కాగా, 216 మంది పరీక్షకు గైరాజరయ్యారు. అదేవిధంగా గణితం పరీక్షకు1481 మందికి 1252 మంది హాజరు కాగా,122 మంది గైర్హాజరయ్యారు. కెమిస్ట్రీ పరీక్షకు 467 మందికి 397 మంది హాజరు కాగా, 70 మంది గైర్హాజరైనట్లు డీఈవో బిక్షపతి తెలిపారు.

News April 22, 2025

పదవీవిరమణ పొందిన హోమ్ గార్డ్‌ను సన్మానించిన ఎస్పీ

image

పోలీస్ శాఖలో 33 సంవత్సరాలుగా సేవలందించడం అభినందనీయమని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. జిల్లా పోలీస్ శాఖలో నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో హోమ్ గార్డ్‌గా పనిచేస్తూ మంగళవారం పదవి విరమణ పొందుతున్న ఆర్.వెంకటేశ్వర్లును జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఘనంగా సత్కరించి వారు పోలీసు శాఖకు అందించిన సేవలను కొనియాడారు.

error: Content is protected !!