News October 18, 2024
భారత్‌పై తొలిసారి 300+లీడ్.. భారీ స్కోరు దిశగా కివీస్

INDతో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దిశగా కివీస్ సాగుతోంది. ఇప్పటికే 300+ లీడ్ సాధించింది. ఆ జట్టుకు భారత్‌పై తొలి ఇన్నింగ్సులో ఇదే అత్యధిక లీడ్ కావడం విశేషం. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 2016లో 412(vsZIM), 2005లో 393(vsZIM), 1985లో 374(vsAUS), 2004లో 363(vsBAN) లీడ్ సాధించింది. అంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇండియాపై ఈ స్థాయి ఆధిక్యత కనబర్చింది. రచిన్(107*), సౌథీ(59*) క్రీజులో ఉన్నారు.
Similar News
News January 30, 2026
ఫామ్‌హౌస్‌లో కుదరదు.. నందినగర్‌లోనే విచారణ: సిట్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ అధికారులు తిరస్కరించారు. హైదరాబాద్ నందినగర్ నివాసంలోనే విచారిస్తామని స్పష్టం చేశారు. అయితే రేపు విచారించాల్సి ఉండగా కేసీఆర్ అభ్యర్థనతో విచారణ తేదీని మార్చారు. ఫిబ్రవరి 1న (ఆదివారం) మ.3 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని తాజాగా మరో నోటీసు ఇచ్చారు.
News January 30, 2026
గోల్డ్, సిల్వర్ ఎఫెక్ట్.. మెటల్ స్టాక్స్ ఢమాల్

బంగారం, వెండి సహా బేస్ మెటల్స్ ధరలు భారీగా తగ్గడంతో ఈరోజు లోహపు షేర్ల విలువలు పడిపోయాయి. హిందూస్థాన్ జింక్ (12%), వేదాంత (11%), NALCO (10%), హిందూస్థాన్ కాపర్ (9.5%), హిందాల్కో (6%), NMDC (4%) స్టాక్స్ వాల్యూస్ కుంగాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఏకంగా 5% పతనమైంది. డాలర్ పుంజుకోవటంతో ఓ దశలో గోల్డ్ ధరలు 9%, సిల్వర్ రేట్లు 15% మేర కరెక్ట్ అయ్యాయి.
News January 30, 2026
బ్లాక్ హెడ్స్‌ను తొలగించే ఇంటి చిట్కాలు

బ్లాక్ హెడ్స్‌ను తొలగించడానికి ముందుగా ముఖానికి ఆవిరి పట్టాలి. తర్వాత వెట్ టవల్‌తో సున్నితంగా రుద్దాలి. * పెరుగు, శనగపిండి, కాఫీ పొడి పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ మీద రాసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత నీటితో కడిగేస్తే సరిపోతుంది. * గుడ్డులోని తెల్లసొనలో బేకింగ్ సోడా కలిసి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత సున్నితంగా మసాజ్ చేసుకొని కడిగేసుకోవాలి.


