News April 13, 2025

తెలుగు విద్యార్థికి 300కు 300 మార్కులు?

image

ఈ నెల 2 నుంచి 8 వరకు జరిగిన JEE మెయిన్ తుది విడత పరీక్షల <>ప్రైమరీ కీ<<>> విడుదలైంది. ఏవైనా అభ్యంతరాలుంటే ఇవాళ రాత్రి 11.50 గంటల్లోపు ఆన్‌లైన్ ద్వారా పంపొచ్చు. పరిశీలన అనంతరం ఫైనల్ కీని రిలీజ్ చేస్తారు. ప్రాథమిక కీ ప్రకారం HYDలో చదువుతున్న అజయ్‌రెడ్డి 300కు 300 మార్కులు సాధించినట్లు సమాచారం. JANలో జరిగిన తొలి విడత ఎగ్జామ్‌లో ఇతను 99.966 పర్సంటైల్ స్కోర్ పొందాడు. అజయ్ సొంతూరు ఏపీలోని నంద్యాల(D) తాటిపాడు.

Similar News

News October 18, 2025

పాక్ దాడుల్లో 8 మంది అప్గాన్ క్రికెటర్లు మృతి!

image

పాక్ జరిపిన వైమానిక దాడుల్లో అప్గానిస్థాన్ క్లబ్ లెవల్ క్రికెటర్లు 8మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అప్గాన్ క్రికెట్ బోర్డు వెల్లడించినట్లు ‘TOLO NEWS’ పేర్కొంది. మరో నలుగురికి గాయాలైనట్లు సమాచారం. మ్యాచులు పూర్తయ్యాక క్రికెటర్లు పక్టికాలోని షరానా నుంచి అర్గోన్‌కు వెళ్తుండగా బాంబు దాడులకు ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. ఈ దాడుల్లో పౌరులు, చిన్నారులు మృతి చెందినట్లు తెలుస్తోంది.

News October 18, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 18, 2025

సీజ్‌ఫైర్‌‌కు తూట్లు.. అఫ్గాన్‌పై పాక్ ఎయిర్ స్ట్రైక్స్

image

పాక్-అఫ్గాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని దోహాలో చర్చలు ముగిసే వరకు పొడిగించారు. కానీ, పాక్ మాత్రం పక్టికా ప్రావిన్స్‌లోని అర్గున్, బర్మాల్ జిల్లాల్లో నివాస ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రైక్స్ చేసినట్లు ‘TOLO NEWS’ పేర్కొంది. దీనిని తాలిబన్ సీనియర్ లీడర్ ఖండించారు. ‘పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. మేము కచ్చితంగా బుద్ధి చెప్తాం’ అని పేర్కొన్నారు.