News May 17, 2024

INDIAకు 300, NDAకు 200 సీట్లు: DK

image

ఈ పార్లమెంటు ఎన్నికల్లో తమ INDIA కూటమికి 300 సీట్లు వస్తాయని కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీయేకు దాదాపు 200 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. సమష్టి నాయకత్వంపై తమకు నమ్మకం ఉందని, ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కలిసి పనిచేస్తున్నామని ఆయన అన్నారు. యూపీలోని లక్నోలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Similar News

News January 12, 2025

70, 90 గంటలు కాదు.. వర్క్ క్వాలిటీ ముఖ్యం: ఆనంద్ మహీంద్రా

image

పని గంటలపై ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, L&T ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. వారిపై తనకు గౌరవం ఉందంటూనే పని గంటలపై కాకుండా వర్క్ క్వాలిటీపై దృష్టిసారించాలని అభిప్రాయపడ్డారు. 70, 90 గంటల కంటే నాణ్యమైన పని 10 గంటలు చేస్తే ప్రపంచాన్ని మార్చేయవచ్చన్నారు. పలు దేశాలు వారంలో నాలుగు రోజుల వర్క్‌ కల్చర్‌కు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.

News January 12, 2025

రాత్రుళ్లు రీల్స్ చూస్తున్నారా? మీరు డేంజర్‌లో ఉన్నట్లే!

image

నిద్రపోకుండా బెడ్‌పైనే గంటల తరబడి రీల్స్ చూస్తున్నారా? ఇది మీకోసమే. రాత్రుళ్లు స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల అధిక రక్తపోటు ప్రమాదం ఉందని ఓ పరిశోధనలో వెల్లడైంది. యువకులు, మధ్య వయస్కుల్లో వచ్చే హైబీపీ నిద్రవేళలో చూసే రీల్స్‌తో ముడిపడి ఉన్నట్లు తేలింది. బెడ్ టైమ్‌లో 4 గంటల కంటే ఎక్కువ సమయం రీల్స్ చూసేవారికి ప్రమాదం ఎక్కువని వెల్లడైంది. కాబట్టి పడుకునేటప్పుడు రీల్స్ చూడటం తగ్గించాలని వైద్యులు సూచించారు.

News January 11, 2025

HYDలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్: సీఎం

image

హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటుకు అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. వివిధ దేశాల్లో బెస్ట్ పాలసీలను పరిశీలించాలన్నారు. ORR లోపల విద్యుత్ కేబుల్స్‌తో పాటు అన్ని రకాల కేబుల్స్ పూర్తిగా అండర్ గ్రౌండ్‌లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీని ద్వారా విద్యుత్ నష్టాలను తగ్గించడంతో పాటు చౌర్యం, ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే విద్యుత్ అంతరాయాలను అధిగమించవచ్చన్నారు.