News May 29, 2024
INDIA కూటమికి 300 సీట్లు.. కేజ్రీవాల్ శ్వేతపత్రం
ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమికి 300, ఎన్డీయేకి 200 సీట్లు వస్తాయని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ టీవీ9 షోలో శ్వేతపత్రంపై రాసిచ్చారు. మరోవైపు తమ కూటమికి ఈసారి 400 సీట్లు వస్తాయని NDA కూటమిలోని ప్రధాన పార్టీ బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఇలా పేపర్‌పై రాసి ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఇండియా కూటమిలో ఉన్న సంగతి తెలిసిందే.
Similar News
News January 19, 2025
IIT బాబాను ఆశ్రమం నుంచి పంపించేశారు!
మహాకుంభమేళాకు వచ్చిన IIT బాబా (అభయ్ సింగ్) SMలో వైరలైన విషయం తెలిసిందే. అయితే తాను ఉంటున్న ఆశ్రమం నుంచి పంపించేశారని ఆయన మీడియాతో తెలిపారు. ఆశ్రమ గురువు మహంత్ సోమేశ్వర్ పూరీని దూషించడమే దీనికి కారణమని తెలుస్తోంది. ‘అర్ధరాత్రి నిర్వాహకులు వెళ్లిపోవాలన్నారు. తనకు మతిస్థిమితం లేదన్నారు. అక్కడ నాకంటే మానసిక స్థితి తెలిసిన సైకాలజిస్టులు ఉన్నారా? నాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి’ అంటూ అభయ్ మండిపడ్డారు.
News January 19, 2025
రాజకీయాల్లోకి ‘కట్టప్ప’ కూతురు
ప్రముఖ నటుడు సత్యరాజ్ కూతురు దివ్య రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ సమక్షంలో డీఎంకే పార్టీలో చేరారు. ఆమె తమిళనాడులో ప్రముఖ పోషకాహార నిపుణులు (న్యూట్రిషనిస్ట్)గా గుర్తింపు పొందారు. కాగా సత్యరాజ్ బాహుబలి, బాహుబలి-2 సినిమాల్లో కట్టప్పగా నటించి దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు.
News January 19, 2025
WEIGHT LOSS: 145kgs నుంచి 75kgలకు!
అజర్ హాసన్ అనే యువకుడు నాలుగేళ్లలో 70 కేజీల బరువు తగ్గి ఫిట్‌నెస్ మోడల్‌గా మారాడు. ఇందులో 55KGS 7 నెలల్లోనే తగ్గినట్లు చెప్పారు. అతడి బాడీ ఫ్యాట్ 55% నుంచి 9%కి తగ్గింది. సరైన శిక్షణ, కఠోర శ్రమ, బ్యాలన్స్‌డ్ డైట్‌తో ఇది సాధ్యమైందన్నారు. తన తండ్రి మృతదేహాన్ని సమాధిలో పెట్టేటప్పుడు ఊబకాయం వల్ల కిందికి వంగలేకపోయానని, ఆ తర్వాత శ్రమించి బరువు తగ్గినట్లు MTV రోడీస్ షోలో అజర్ తెలిపారు.