News March 19, 2025
300 సీసీ కెమెరాలు వితరణ.. జ్ఞాపికలు అందజేసిన ఎస్పీ

రూ.33 లక్షల విలువ చేసే 300 అత్యాధునిక సోలార్ బేస్డ్ సీసీ కెమేరాలను మొబిస్ ఇండియా మాడ్యుల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు జిల్లా ఎస్పీ జగదీశ్ సమక్షంలో ఆత్మకూరు పోలీసులకు అందజేశారు. దాతలైన హ్యుండాయ్ మొబీస్ కంపెనీ ప్రతినిధులకు జిల్లా ఎస్పీ జ్ఞాపికలు అందజేశారు. ఆత్మకూరు, ఇటుకలపల్లి పోలీసు స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News March 19, 2025
హిందూపురం వ్యక్తి దారుణ హత్య

శ్రీ సత్యసాయి జిల్లా మలుగూరు సమీపంలో హిందూపురానికి చెందిన సద్దాం(35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరగగా.. బుధవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హిందూపురం రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News March 19, 2025
ఆటో ప్రమాదంలో ఒకరు మృతి

తాడిపత్రి మండలంలోని సజ్జలదిన్నె వద్ద జరిగిన ఆటో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. తాడిపత్రిలోని శ్రీనివాసపురానికి చెందిన రసూల్ బేగం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నంద్యాల జిల్లా పేరు సోమల గ్రామానికి మిర్చి కోసేందుకు వెళ్లి వస్తున్న సందర్భంలో ఆటో బోల్తా పడటంతో మృతి చెందింది.
News March 18, 2025
ఎల్లనూరులో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల షెడ్యూల్

ఎల్లనూరులో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు అర్చనలు నిర్వహించారు. ☛ 18న సింహ వాహనం ☛ 19న శేష వాహనం ☛ 20న హనుమంత వాహనం☛ 21న గరుడ వాహనం☛ 22న కళ్యాణోత్సవం☛ 23న రథోత్సవం☛ 24న అశ్వ వాహనం☛ 25న వసంతోత్సవం, హంస వాహనం☛ 26న ఏకాంతోత్సవం