News March 21, 2024
అకౌంట్లలోకి రూ.3,000 అంటూ ప్రచారం..
పోస్టాఫీస్లో అకౌంట్ ఓపెన్ చేస్తే రూ.3 వేలు జమ అవుతాయని, ఇది మోదీ గ్యారంటీ అంటూ కర్ణాటకలో వదంతులు వ్యాపించాయి. దీంతో హుబ్బళ్లి, ఉద్యామ్నగర్, నవనగర్, గిర్నిచాల్ తదితర ప్రాంతాల్లోని మహిళలు పోస్టాఫీసులకు పోటెత్తారు. ఇలాంటి పథకమేదీ లేదని సిబ్బంది చెప్పినా వినిపించుకోలేదు. తమకు అకౌంట్లు ఓపెన్ చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఉన్నతాధికారులు రంగంలోకి దిగి మహిళలకు నచ్చజెప్పారు.
Similar News
News November 25, 2024
మీలా పైరవీలు చేయడానికి ఢిల్లీ వెళ్లడంలేదు: రేవంత్
TG: తాను తరచూ ఢిల్లీ వెళ్తానంటూ కేటీఆర్ చేస్తున్న విమర్శలకు CM రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ‘మీలా పైరవీలు చేయడానికి, బెయిల్ కోసం నేను వెళ్లడంలేదు. కేంద్రాన్ని కలిసి మనకు రావాల్సిన నిధులను రాబట్టుకోవడానికే వెళ్లా. అవసరమైతే ఎన్నిసార్లైనా వెళ్తాం. లోక్సభ స్పీకర్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు ఇవాళ హస్తినకు వెళ్తున్నా. ఈ పర్యటనకు ఎలాంటి రాజకీయ సంబంధం లేదు’ అని రేవంత్ వివరించారు.
News November 25, 2024
రాజ్యాంగబద్ధంగానే అదానీ నుంచి పెట్టుబడులు: సీఎం
TG: రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగానే అదానీ నుంచి తెలంగాణలో పెట్టుబడులు స్వీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రూల్స్ ప్రకారమే టెండర్లు పిలిచి ప్రాజెక్టులు ఇస్తున్నామన్నారు. దేశంలోని ఏ సంస్థలకైనా చట్టబద్ధంగా వ్యాపారం చేసుకునే హక్కు ఉంటుందన్నారు. అంబానీ, అదానీ, టాటా ఎవరికైనా వ్యాపారం చేసుకునే హక్కు ఉందన్నారు. చట్టబద్ధంగా ఉన్న సంస్థల నుంచే తాము కూడా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.
News November 25, 2024
IPL మెగా వేలం రెండో రోజు ప్రారంభం
సౌదీలోని జెడ్డాలో IPL మెగా వేలం రెండో రోజు ప్రారంభమైంది. తొలి రోజు వేలంలో 72మంది ప్లేయర్లను ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. వారిలో 24 మంది ఓవర్సీస్ ప్లేయర్లు ఉన్నారు. ఆటగాళ్ల కోసం జట్ల యాజమాన్యాలు ₹467.95 కోట్లు ఖర్చు చేయగా, పంత్ను LSG రూ.27కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. jiocinema, StarSportsలో ఆక్షన్ లైవ్ చూడొచ్చు.