News May 1, 2024

30వేల మంది ఆడబిడ్డల తాళిబొట్లు తెంచారు: చంద్రబాబు

image

AP: మద్యం దుకాణాల్లో ఇష్టానుసారంగా జే బ్రాండ్లు పెట్టి 30వేల మంది ఆడబిడ్డల తాళిబొట్లు తెంచారని జగన్‌పై చీరాల సభలో TDP చీఫ్ చంద్రబాబు ధ్వజమెత్తారు. భవన నిర్మాణ కార్మికులు పని దొరక్క ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. నియంతలా పాలించాలనుకున్న జగన్.. విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. రాష్ట్రాన్ని మాఫియాల రాజ్యంగా మార్చారని, దుర్మార్గ పాలన తుదముట్టించి ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని స్పష్టం చేశారు.

Similar News

News March 4, 2026

ఎండలు బాబోయ్..! ఏప్రిల్, మేలో హీట్ వేవ్స్

image

దేశంలో ఈసారి ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మార్చి నుంచి మే వరకు సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఏప్రిల్, మేలో దక్షిణ, మధ్య భారతంలో హీట్ వేవ్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని వెల్లడించింది. తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు తప్పవని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అటు TGలో వచ్చే రెండు,మూడు రోజుల్లో టెంపరేచర్ 40డిగ్రీలను తాకుతుందని అంచనా వేసింది.

News March 4, 2026

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

image

TG: రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే 16 మంది లిస్ట్‌ను టీపీసీసీ హైకమాండ్‌కు పంపింది. దీనిపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ తదితరులతో చర్చించనున్నారు. ఆపై ఏఐసీసీ పేర్లను ఖరారు చేయనుంది. రెండు సీట్లలో ఒక స్థానానికి ప్రస్తుత ఎంపీ అభిషేక్ సింఘ్వీని కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

News March 4, 2026

మే 18 నుంచి ఆటల పోటీలు.. జాబ్ మేళాలు!

image

TG: ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా యువత కోసం ప్రభుత్వం మే 18 – 23 మధ్య ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనుంది. హెల్త్ అవేర్‌నెస్ కోసం 18న మండల స్థాయిలో 5కే మారథాన్, 2కే వాకథాన్, యోగా తరగతులు నిర్వహిస్తారు. 19న ఉద్యోగావకాశాలపై అవగాహన, 20న జిల్లా స్థాయిలో జాబ్ మేళాలు నిర్వహిస్తారు. 21న ఆటల పోటీలు, 22న స్వచ్ఛతపై కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక 23న 50 మందితో యూత్ పార్లమెంట్ నిర్వహించనుంది.