News August 12, 2024

రాష్ట్రంలో కొత్తగా 30,750 ఉద్యోగాలు: CMO

image

TG: అమెరికాలో పర్యటించిన CM రేవంత్ బృందం మొత్తం ₹31,500 కోట్ల పెట్టుబడులు రాబట్టినట్లు CMO వెల్లడించింది. దాదాపు 19 కంపెనీలు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. వీటిలో కాగ్నిజెంట్, అమెజాన్, చార్లెస్ స్క్వాబ్, ఆమ్జెన్, మోనార్క్ ట్రాక్టర్, జొయిటిస్, HCA హెల్త్ కేర్, వివింట్ ఫార్మా వంటివి ఉన్నాయి. వీటి వల్ల రాష్ట్రంలో కొత్తగా 30,750 ఉద్యోగాలు లభించనున్నాయి.

Similar News

News January 19, 2025

ఇండో-కొరియన్ హారర్ కామెడీ జోనర్‌లో వరుణ్ కొత్త చిత్రం

image

‘మట్కా’ డిజాస్టర్ తర్వాత వరుణ్ తేజ్ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ మూవీ ఇండో కొరియన్ హారర్ కామెడీ జోనర్‌లో ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఇవాళ వరుణ్ బర్త్‌డే సందర్భంగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘కదిరి నరసింహసామి సాచ్చిగా ఈ తూరి నవ్వించేకి వస్తుండా’ అని మెగా ప్రిన్స్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తారు.

News January 19, 2025

ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం.. తన కొడుకును ఉరి తీయాలన్న తల్లి

image

కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో సంజయ్ రాయ్‌ను కోర్టు దోషిగా తేల్చడంపై అతని తల్లి మాలతి(70) స్పందించారు. తన కొడుకు చేసిన తప్పును మహిళగా క్షమించబోనని స్పష్టం చేశారు. తనకూ ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, వైద్యురాలి తల్లి బాధను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. అతడికి మరణ శిక్ష విధించినా అభ్యంతరం లేదన్నారు. ఈ కేసుపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఉద్దేశం తమకు లేదని సంజయ్ సోదరి కూడా తేల్చిచెప్పారు.

News January 19, 2025

సైఫ్, కరీనా నవ్వుతున్న AI ఫొటో.. ఎంపీపై విమర్శలు

image

సైఫ్ అలీఖాన్‌పై దాడి దురదృష్టకరమని నటుడు, ఎంపీ శత్రుఘ్న సిన్హా అన్నారు. ఆయన త్వరగా కోలుకుంటున్నందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపారు. సైఫ్ బెడ్‌పై, కరీనా పక్కనే కూర్చుని నవ్వుతున్నట్లు ఉన్న AI జనరేటెడ్ ఫొటోను షేర్ చేశారు. దీంతో కుటుంబం ఇబ్బందుల్లో ఉంటే ఇలాంటి ఫొటోలు పంచుకోవడం అవసరమా? అని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. అయితే దీన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదని మరికొందరు అంటున్నారు.