News March 24, 2024

30న గుత్తికి రానున్న సీఎం జగన్

image

30న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుత్తికి రానున్నట్లు వైసీపీ గుత్తి పట్టణ కన్వీనర్ హుస్సేన్ పీరా ఆదివారం తెలిపారు. బస్సు యాత్రలో భాగంగా సీఎం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుంచి 30వ తేదీన గుత్తికి రానున్నారు. గుత్తిలో బస్సు యాత్ర ముగిసిన తర్వాత కడప జిల్లా పులివెందులకు తరలి వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు.

Similar News

News April 24, 2025

స్వచ్ఛతలో అనంతపురం జిల్లాకు అవార్డు

image

స్వచ్ఛ ఆంధ్ర అమలులో అనంతపురం జిల్లాకు అవార్డు దక్కింది. రాష్ట్రంలోనే తొలి స్థానంలో అనంతపురం, ద్వితీయ స్థానంలో సత్యసాయి జిల్లా నిలిచాయి. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కృష్ణతేజ ప్రకటించారు. నేడు విజయవాడలో జరగనున్న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ అవార్డును అందుకోనున్నారు.

News April 24, 2025

ఈతకు వెళ్లి బీఫార్మసీ విద్యార్థి మృతి

image

నెల్లూరు జిల్లాలో చదువుకుంటున్న అనంతపురం యువకుడు ఈతకు వెళ్లి మృతిచెందాడు. కళ్యాణదుర్గం మండలం గొల్ల గ్రామానికి చెందిన అంజి నార్త్ రాజుపాలెంలోని వేంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజీలో బీఫార్మసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీకి సమీపంలోని రేగడిచిలక వద్ద బావి దగ్గరికి ఐదుగురు విద్యార్థులతో కలిసి ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో బావిలో మునిగి చనిపోయాడు.

News April 23, 2025

కూలీ కుమారుడికి 593 మార్కులు

image

గుత్తి మోడల్ స్కూల్ విద్యార్థి నరసింహ పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. 593 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచారు. నరసింహ తండ్రి ఐదేళ్ల క్రితం మృతిచెందగా తల్లి కళావతి కూలీ పని చేస్తూ కొడుకును చదివిస్తోంది. పేదింటి బిడ్డ మంచి మార్కులతో సత్తా చాటడంతో ఉపాధ్యాయులు, బంధువులు విద్యార్థిని అభినందించారు. తల్లి కళావతి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 

error: Content is protected !!