News January 27, 2025
31న టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం

ఈనెల 31న TTD పాలక మండలి అత్యవసర సమావేశం జరగనుందని TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు X వేదికగా తెలిపారు. రథసప్తమి ఏర్పాట్లపై సభ్యులు, అధికారులతో క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. జనవరి 8న తిరుపతి తోపులాట ఘటనను దృష్టిలో ఉంచుకొని అధికారులు పటిష్ఠమైన ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఫిబ్రవరి 4న పలు ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలపై విఐపీ బ్రేక్ దర్శనాలు, అన్ని ప్రివిలైజ్ దర్శనాలను రద్దు చేసింది.
Similar News
News December 6, 2025
మెదక్: మరోసారి అవకాశం కల్పిస్తాం.. ఈ సారికి ఆగు..!

పంచాయతీ ఎన్నికల్లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే తొలి విడత, రెండో విడత, మూడో విడత నామినేషన్ల స్వీకరణ పూర్తి అయింది. ఈసారి తమకు అనుకూలంగా రిజర్వేషన్ రావడంతో ఒకే పార్టీకి చెందిన పలువురు నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఒకరినొకరు బుజ్జగిస్తున్నారు. నామినేషన్లు వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేస్తున్నారు. మరోసారి నీకు అవకాశం కల్పిస్తాం.. ఈసారికి ఆగు అన్నట్లు మాట్లాడుతున్నారు.
News December 6, 2025
ఖమ్మం: ఎన్నికలు.. రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి

ఖమ్మం జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కోసం పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ను పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సమక్షంలో పూర్తి చేశారు. కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు. 192 గ్రామ పంచాయతీలకు, 1740 వార్డులకు గాను 1582 బృందాలు సిద్ధమయ్యాయి. నిబంధనల ప్రకారం 20% సిబ్బందిని రిజర్వ్‌లో ఉంచారు.
News December 6, 2025
GNT: గర్భందాల్చిన ఇంటర్ విద్యార్థిని.. యువకుడిపై కేసు నమోదు

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చడానికి కారణమైన పొట్టిశ్రీరాములునగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడిపై అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. PS నగర్‌కి చెందిన విద్యార్థినికి అదే ప్రాంతానికి చెందిన నాని అనే యువకుడు మాయమాటల చెప్పి లోబరుచుకున్నాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.


