News January 28, 2025
31న పెనుగొండ రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

ఈ నెల 31వ తేదీ శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పెనుగొండలో పర్యటించనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది నుంచి కూటమి ప్రభుత్వం పెనుగొండలో కొలువైన శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుఅమ్మవారిని దర్శించుకుని ఆత్మార్పణ దినోత్సవంలో పాల్గొంటారని సమాచారం.
Similar News
News February 11, 2025
వేల్పూరులో బర్డ్ ఫ్లూ నిర్ధారణ: జిల్లా కలెక్టర్

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుండడంతో జిల్లా కలెక్టర్ నాగరాణి మంగళవారం అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. తణుకు మండలం వేల్పూరులోని కృష్ణానంద పౌల్ట్రీ ఫామ్ లో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయినట్లు చెప్పారు. వేల్పూరు నుంచి పది కిలోమీటర్ల వరకు అలర్ట్ జోన్ ప్రకటించారు. చికెన్, కోడిగుడ్లు అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించారు. అన్ని షాపులను మూసివేయాలని సూచించారు.
News February 11, 2025
ఆత్మహత్య చేసుకున్న తణుకు ఎస్సై కుటుంబానికి స్నేహితుల అండ

ఇటీవల రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ మూర్తి కుటుంబానికి ఆయన స్నేహితులు రూ. 45.68 లక్షల సాయం చేశారు. 2012 బ్యాచ్‌కు చెందిన ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి ఇటీవల తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆయన స్నేహితులు కలిసి రూ. 45.68 లక్షల ఆర్థిక సహాయాన్ని మూర్తి భార్య విజయకు చెక్కు రూపంలో సోమవారం అందజేశారు.
News February 11, 2025
ఉంగుటూరు : రైలు పట్టాలపై దంపతుల ఆత్మహత్య

ఉంగుటూరు రైల్వే స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులు బాధ వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో దొరికిన ఫోన్ ఆధారంగా వారు పెంటపాడు మండలానికి చెందిన వారుగా తెలుస్తోంది. ప్రమాదంలో మృతదేహాలు ముక్కలు ముక్కలుగా పడి ఉన్నాయి. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.