News December 30, 2025
31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ: కలెక్టర్

ఎన్టీఆర్ జిల్లాలో నూతన సంవత్సరం సందర్భంగా 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 303 కొత్త పెన్షన్లతో కలిపి మొత్తం 2,28,592 పెన్షన్లకు రూ.98.95 కోట్లు పంపిణీ చేయనున్నారు. పెన్షన్లు ఇంటింటికీ సజావుగా అందేలా క్షేత్రస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఎక్కడా లోటుపాట్లు లేకుండా పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News December 31, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు:
* బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.13,745
* బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12,645
* వెండి 10 గ్రాముల ధర: రూ.2,350
News December 31, 2025
నిమెసులైడ్ తయారీ, సేల్స్‌పైనా కేంద్రం ఆంక్షలు

పెయిన్‌కిల్లర్ నిమెసులైడ్ తయారీ, సేల్స్‌పై కేంద్రం ఆంక్షలు విధించింది. 100mg కంటే ఎక్కువ పవర్ ఉండే ఈ మెడిసిన్ తయారీని వెంటనే ఆపేయాలని ఆదేశాలిచ్చింది. డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డుతో చర్చల తర్వాత హెల్త్ మినిస్ట్రీ నోటిఫికేషన్ ఇచ్చింది. ‘100mg కంటే ఎక్కువ డోస్ ఉండే నిమెసులైడ్ లివర్‌కు ప్రమాదం. దీనికి ప్రత్యామ్నాయ మందులు అందుబాటులో ఉన్నాయి. దీనిపై తక్షణమే నిషేధం విధిస్తున్నాం’ అని పేర్కొంది.
News December 31, 2025
చీని, నిమ్మ తోటల్లో ఎగిరే పేను బెడద

చీని, నిమ్మ తోటల్లో కొన్నేళ్లుగా ఎగిరేపేను ఉద్ధృతి కనిపిస్తోంది. ఈ పురుగులు లేత ఆకులు, పూతను ఆశించి రసం పీల్చడం వల్ల ఆకులు వాడిపోయి, వంకర్లు తిరగడంతో పాటు పూత కూడా రాలిపోతోంది. దీని వల్ల మొక్కల పెరుగుదల ఆగిపోయి కొమ్మలు పై నుంచి కిందకు ఎండిపోతాయి. రసం పీల్చడం వల్ల ఆకులు, కాయలపై జిగురు వంటి పదార్థం విడుదలై నల్లని బూజు ఏర్పడుతుంది. ఎగిరే పేను వల్ల చీని, నిమ్మ తోటల్లో శంకు తెగులు కూడా వ్యాపిస్తుంది.


