News March 28, 2025
31న జరగాల్సిన టెన్త్ సోషల్ ఎగ్జామ్ వాయిదా

ఈ నెల 31న జరగాల్సిన సాంఘిక శాస్త్రం పరీక్ష ఏప్రిల్ ఒకటికి వాయిదా వేసినట్లు డీఈవో మాణిక్యం నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 31న రంజాన్ కారణంగా పరీక్ష వాయిదా వేసినట్లు చెప్పారు. 31న జరగాల్సిన పరీక్షను ఏప్రిల్ ఒకటిన ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతుందని, విద్యార్థులు గమనించాలని కోరారు.
Similar News
News March 31, 2025
బొబ్బిలి: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

బొబ్బిలి సమీపంలోని దిబ్బగుడివలస – గుమ్మడివరం మధ్యలో రైలు పట్టాల వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని GRP హెడ్ కానిస్టేబుల్ ఈశ్వరరావు తెలిపారు. సదరు వ్యక్తి రైలు నుంచి జారిపడడంతో తీవ్రంగా గాయపడి మృతిచెంది ఉంటాడని ప్రాథమిక నిర్ధారణలో తెలిపారు. మృతుని వివరాలు తెలియరాలేదని ఎవరైనా గుర్తిస్తే బొబ్బిలి రైల్వే పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
News March 31, 2025
గంట్యాడ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఉగాది రోజు ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. గంట్యాడ మండలం కొటారుబిల్లి జంక్షన్‌లో కులిమిశెట్టి కృష్ణ (65)ను ఆదివారం ఓ బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కృష్ణను స్థానికులు విజయనగరం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు గంట్యాడ SI సాయకృష్ణ సోమవారం తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
News March 31, 2025
రంజాన్ మాసం అందిర జీవితంలో వెలుగులు నింపాలి: జడ్పీ ఛైర్మన్

పవిత్ర రంజాన్ సందర్భంగా అల్లాహ్ తన కరుణతో అందరినీ దీవించాలని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. అందరికీ ఆరోగ్యం, శ్రేయస్సు, ప్రశాంతత లభించాలని కోరారు. రంజాన్ మాసం జీవితాల్లో వెలుగు నింపాలనీ, ప్రేమ, శాంతి, సామరస్యాన్ని అందించాలనీ కోరారు. ఉపవాస దీక్షలు, ప్రార్థనలతో మన హృదయాలను శుద్ధి చేసుకోవాలని, విజయానికి మార్గం సుగమం కావాలని ఆయన అభిలషించారు.