News October 27, 2024
31న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు: టీటీడీ
తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం సందర్భంగా ఈ నెల 31వ తేదీన ప్రోటోకాల్ ప్రముఖులు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసినట్లు TTD అధికారులు తెలిపారు. ఈ మేరకు టీటీడీ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించి 30వ తేదీ బుధవారం తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులను కోరింది.
Similar News
News December 25, 2024
చిత్తూరు: వార్షిక తనిఖీలు నిర్వహించిన ఎస్పీ
చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మణికంఠ వార్షిక తనిఖీలు నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. మత్తు పదార్థాల వినియోగంపై కలిగే అనర్థాలను వివరించాలన్నారు. చోరీలకు అడ్డకట్టవేసేలా నిఘా పకడ్బందీగా నిర్వహించాలని తెలియజేశారు.
News December 24, 2024
PV.సింధు దంపతులను కలిసిన మాజీ మంత్రి రోజా
హైదరాబాదులోని అన్వయ కన్వెన్షన్ హాల్లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి PV.సింధూ, వెంకట దత్త సాయి దంపతులను మాజీ మంత్రి రోజా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు.
News December 24, 2024
టీటీడీలో ఫుడ్ సేఫ్టి విభాగం ఏర్పాటు
టీటీడీలో త్వరలో ఫుడ్ సేఫ్టి విభాగం ఏర్పాటు చేసి సీనియర్ ఫుడ్ సేఫ్టి ఆఫీసర్ పోస్టు నియమించుకునేందుకు బోర్డు నిర్ణయం తీసుకుంది. భక్తుల కోసం రూ.3.36 కోట్లతో 6 టాయిలెట్ బ్లాక్స్ నిర్మించేందుకు ఆమోదం. ఒంటిమిట్ట ఆలయ విమాన గోపురానికి రూ.43 లక్షలతో బంగారు కలశం ఏర్పాటు. ముంబైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి 3.60 ఎకరాల స్థలానికి నిర్ణయించిన రూ.20కోట్లకు పైగా ఉన్న లీజు ధరను తగ్గించాలి.