News December 29, 2025
31న సమ్మె.. టైమ్ చూసి దెబ్బ!

ఏడాది ముగింపు వేళ మరోసారి డెలివరీ వర్కర్లు(గిగ్) <<18690914>>సమ్మెకు<<>> సిద్ధమవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో పార్టీ మూడ్‌లో ఉండే ప్రజలకు ఫుడ్, గిఫ్ట్‌లు ఇతర ఆర్డర్లు అందిస్తూ ఈ వర్కర్లు కీలకంగా వ్యవహరిస్తారు. దీంతో 31న సమ్మె చేస్తే తమ డిమాండ్లు నెరవేరుతాయని వారు భావిస్తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే ఈ రోజున వీరికి డిమాండ్ ఎక్కువే. మెట్రో, టైర్-2 సిటీల్లో సమ్మె ప్రభావం ఎక్కువగా కనిపించనుంది.
Similar News
News December 30, 2025
ఇక నుంచి స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ సచివాలయాలు

AP: గ్రామ, వార్డు సచివాలయాల పేరును ప్రభుత్వం అధికారికంగా మార్చింది. ఇక నుంచి ‘స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ సచివాలయాలు’గా మారుస్తూ ఆర్డినెన్స్ జారీకి నిన్న క్యాబినెట్ ఆమోదం తెలిపింది. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలకపాత్ర పోషించనున్నాయని మంత్రులు పేర్కొన్నారు. జిల్లా GSWS కార్యాలయాల పేరు కూడా మారుస్తామని వెల్లడించారు.
News December 30, 2025
టోకెన్లు లేని భక్తులు జనవరి 2 నుంచి రావాలి: టీటీడీ ఈవో

AP: వైకుంఠ ద్వారదర్శనాలు ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ మూడు రోజులు ఆన్‌లైన లక్కీ డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తామని చెప్పారు. టోకెన్లు లేని భక్తులు జనవరి 2న నేరుగా రావాలని విజ్ఞప్తి చేశారు. వారికి జనవరి 8 వరకు దర్శనాలకు అనుమతి ఇస్తామని పేర్కొన్నారు.
News December 30, 2025
అరటి పరిమాణం పెంచే ‘బంచ్ ఫీడింగ్’ మిశ్రమం

అరటి కాయల పరిమాణం పెరుగుదలకు భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ బంచ్ ఫీడింగ్ మిశ్రమం రూపొందించింది. 100ml నీటిలో 7.5 గ్రా. నత్రజని ఎరువు, 7.5 గ్రాముల పొటాష్ ఎరువు కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని 500 గ్రాముల పేడలో బాగా కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని పైన ఫొటోలో చూపినట్లు కాయలు కాసిన తర్వాత క్రింది పువ్వును కత్తిరించి, ఆ మిశ్రమం ఉన్న పాలిథిన్ సంచిలో కాయలు కాసిన కాడకు ఒక అడుగు దూరం వదిలి గట్టిగా కట్టాలి.


