News April 2, 2024
31 ఓట్ల అత్యల్ప మెజార్టీతో MLAగా ఎన్నిక

తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 1952-2019 వరకు 17సార్లు ఎన్నికలు జరిగాయి. వీటిలో 1987వ సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఈలి వరలక్ష్మి.. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన పి.కనక సుందరరావుపై 31 ఓట్ల అత్యల్ప మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వరలక్ష్మికి 42,062 ఓట్లు రాగా.. కనక సుందరరావుకు 42,031 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటివరకు ఈ నియోజకవర్గ చరిత్రలో ఇదే అత్యల్ప మెజార్టీ.
Similar News
News July 11, 2025
వీరవాసరంలో తిరువణ్ణామలై ఎక్స్ ప్రెస్ హాల్ట్

నరసాపురం నుంచి తిరువణ్ణామలై (అరుణాచలం) వీక్లి ఎక్స్ ప్రెస్ ఇక నుంచి వీరవాసరంలో కూడా హాల్ట్ ఉంటుందని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ శుక్రవారం తెలిపారు. 2 నిమిషాల హాల్ట్‌కు దక్షిణ మధ్య రైల్వే ఆమోదం తెలిపిందని అయన తెలిపారు. ఈనెల 9న ప్రారంభమైన అరుణాచలం వీక్లి ఎక్స్ ప్రెస్‌లో తాను ప్రయాణించినప్పుడు వీరవాసరంలో కూడా హాల్ట్ ఇవ్వాలని స్థానిక ప్రజలు కోరడం జరిగిందన్నారు.
News July 11, 2025
ప.గో: 641.544 కిలోల గంజాయి ధ్వంసం

పశ్చిమ గోదావరి జిల్లాలో స్వాధీనం చేసుకున్న 641.544 కిలోల గంజాయిని గుంటూరు జిల్లా కొండవీడులోని జిందాల్ అర్బన్ మేనేజ్‌మెంట్ ఈ-వేస్టేజ్ లిమిటెడ్‌లో అధికారులు ధ్వంసం చేశారు. 64 కేసులకు సంబంధించిన ఈ గంజాయిని బాయిలర్‌లో వేసి కాల్చివేసినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. ఈ ఆపరేషన్‌లో కృషి చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
News July 11, 2025
భీమవరం: రైతుల అభ్యంతరాలపై జేసి ఛాంబర్‌లో విచారణ

జాతీయ రహదారి 165 నిర్మాణంలో భాగంగా ఉండి మండలం పెద్దపుల్లేరు గ్రామం రైతులు లేవనెత్తిన అభ్యంతరాలపై జేసి రాహుల్ గురువారం అధికారుల సమక్షంలో విచారణ చేపట్టారు. భూసేకరణపై జూన్ 14న అభ్యంతరాలు గడువు ముగియడంతో ఆ గ్రామం నుంచి అందిన 5 మంది రైతులు అభ్యంతరాలపై నేడు విచారణ జరిగింది. మూడు అంశాలపై రైతులు అభ్యంతరాలను వ్యక్తపరచగా వీటిని ఎన్‌హెచ్ అధికారులు పరిష్కరించేందుకు రైతులకు హామీ ఇచ్చారని జేసి తెలిపారు.