News April 13, 2025
క్షిపణి దాడిలో 31 మంది మృతి

ఉక్రెయిన్లోని సుమీ నగరంపై రష్యా సైన్యం బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 31 మంది మరణించినట్లు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారని, 84 మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. ప్రపంచ దేశాలు మౌనంగా ఉండకుండా రష్యా దాడులను ఖండించాలని ఆయన కోరారు. రష్యాపై బలమైన ఒత్తిడి తీసుకురాకపోతే ఈ యుద్ధాన్ని ఇలాగే కొనసాగిస్తుందని అన్నారు.
Similar News
News September 16, 2025
దసరా సెలవులు ఎప్పుడంటే?

AP: స్కూళ్లకు ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు 9 రోజుల పాటు దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. మైనారిటీ పాఠశాలలకు ఈ నెల 27 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఉండనున్నాయి. జూనియర్ కాలేజీలకు SEP 28 నుంచి OCT 5 వరకు హాలిడేస్ ఉంటాయి. అటు తెలంగాణలో స్కూళ్లకు ఈనెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు, జూనియర్ కాలేజీలకు ఈనెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉండనున్నాయి.
News September 16, 2025
పెళ్లిపై మరోసారి స్పందించిన జాన్వీ కపూర్

తన పెళ్లిపై స్టార్ హీరోయిన్ జాన్వీ మరోసారి స్పందించారు. ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆమెకు పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. ‘ప్రస్తుతం నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. నా ఫోకస్ అంతా సినిమాలపైనే ఉంది. వివాహానికి ఇంకా చాలా సమయం ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ డేటింగ్లో ఉన్నట్లు టాక్.
News September 16, 2025
యూసుఫ్ పఠాన్ను ఆక్రమణదారుడిగా పేర్కొన్న హైకోర్టు

ఆక్రమించిన ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేయాలని మాజీ క్రికెటర్, MP యూసుఫ్ పఠాన్ను గుజరాత్ హైకోర్టు ఆదేశించింది. అతడిని ఆక్రమణదారుడిగా పేర్కొంది. సెలబ్రిటీలు చట్టానికి అతీతులు కారని చెప్పింది. వడోదరలో ఇంటి పక్కనున్న ఖాళీ స్థలాన్ని యూసుఫ్ ఆక్రమించగా 2012లో సర్కార్ నోటీసులిచ్చింది. తాను, తన సోదరుడు క్రికెటర్లమని, సెక్యూరిటీ దృష్ట్యా ఆ భూమిని కొనేందుకు అనుమతించాలని కోరగా హైకోర్టు తాజాగా తిరస్కరించింది.