News December 18, 2025

311 పోస్టులకు నోటిఫికేషన్

image

రైల్వేలో 311 ఉద్యోగాల భర్తీకి RRB షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్, జూ.ట్రాన్స్‌లేటర్, స్టాఫ్&వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్ తదితర ఖాళీలున్నాయి. పోస్టును బట్టి ఇంటర్, డిప్లొమా, PG(హిందీ&ఇంగ్లిష్), డిగ్రీ పాసై, వయసు 18-40 ఏళ్లు ఉండాలి. DEC 30 నుంచి JAN 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. త్వరలో పూర్తిస్థాయి నోటిఫికేషన్ వెలువడనుంది.
వెబ్‌సైట్: rrbcdg.gov.in/

Similar News

News December 22, 2025

మినుము, పెసర.. 20 రోజులు దాటాకా కలుపు నివారణ

image

మినుము, పెసర విత్తిన 20 రోజులకు గడ్డిజాతికి చెందిన కలుపు మొక్కలు మాత్రమే 2,3 ఆకుల దశలో ఉన్నప్పుడు ఎకరాకు 200 లీటర్ల నీటిలో క్విజాలోఫాప్ ఇథైల్ 5% 400ml లేదా ప్రొపాక్విజాఫాప్ 10% 250ml కలిపి పిచికారీ చేయాలి. పొలంలో గడ్డిజాతి, వెడల్పాకు కలుపు మొక్కలు ఉంటే ఎకరాకు 200 లీటర్ల నీటిలో ఇమజితాఫిర్ 10% 200ml లేదా ఫోమెసాఫెన్ 11.1% + ఫ్లుజిఫాప్-పి-బ్యుటెల్ 11.1% 400 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి.

News December 22, 2025

యూనిసెఫ్ ‘ఫొటో ఆఫ్ ది ఇయర్’ ఇదే!

image

అఫ్గాన్‌లో బాలికల విద్యపై ఫ్రెంచ్ ఫొటోగ్రాఫర్ ఎలిస్ బ్లాంచర్డ్ తీసిన చిత్రానికి యూనిసెఫ్ ‘ఫొటో ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కింది. మారుమూల గ్రామంలో ఓ ఇంట్లో చదువుకుంటున్న హజీరా(10) ఫొటో ఇందుకు ఎంపికైంది. తాలిబన్ల పాలనలో బాలికలు స్కూలుకు వెళ్లడం నిషేధం. దీంతో 22 లక్షల మంది అమ్మాయిలు చదువుకు దూరమవుతున్నారు. ఇలాంటి వారిలో హజీరా ఒకరు. అఫ్గాన్‌లో బాలికలకు విద్య అసాధ్యమైన కలగా మారిందని యూనిసెఫ్ పేర్కొంది.

News December 22, 2025

‘పురమిత్ర’లో 5 ఫిర్యాదులొస్తే కమిషనర్‌దే బాధ్యత

image

AP: మున్సిపాల్టీల పరిధిలోని సమస్యలను త్వరితంగా పరిష్కరించేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పురమిత్ర’ యాప్‌కు మరో కొత్త ఫీచర్‌ యాడ్ అయింది. ఏదైనా ప్రాంతం నుంచి ఒకేరకమైన సమస్యపై 5 ఫిర్యాదులు వస్తే డాష్ బోర్డులో ఆరెంజ్ రంగు ద్వారా అది మున్సిపల్ కమిషనర్‌ను అలర్ట్ చేస్తుంది. ఆయన తక్షణం ఆ ప్రాంతానికి వెళ్లి సమస్య పరిష్కరించాలి. ఈ విధానాన్ని పంచాయతీల్లోనూ అమలు చేయాలని Dy CM పవన్‌ను ప్రజలు కోరుతున్నారు.