News September 13, 2025

3,115 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ

image

ఈస్టర్న్ రైల్వేలో 3,115 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే(SEP 13) చివరితేదీ. ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, పెయింటర్, లైన్‌మెన్, వైర్‌మెన్, ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్ విభాగాల్లో ఖాళీలున్నాయి. టెన్త్, ఇంటర్, ఉద్యోగాన్ని బట్టి ఐటీఐలో పాసవ్వాలి. వయసు 15-24ఏళ్ల లోపు ఉండాలి. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వెబ్‌సైట్: <>https://rrcrecruit.co.in/<<>>

Similar News

News February 3, 2026

లండన్‌లో మంత్రి నారాయణ పర్యటన

image

AP: అమరావతి నిర్మాణంలో భాగంగా పలు ప్రాజెక్టుల అధ్యయనం కోసం యూకేలో మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగుతోంది. అమరావతిలో అమలు చేయగలిగే ఆధునిక పట్టణ ప్రణాళిక, స్పోర్ట్స్ సిటీ, రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ వంటి అంశాలపై ఈ బృందం అధ్యయనం చేస్తోంది. లండన్ కార్పొరేషన్ ప్లానింగ్ డైరెక్టర్ గ్విన్ రిచర్డ్స్‌తో మంత్రి సమావేశమయ్యారు. లండన్ మాస్టర్ ప్లాన్, రవాణా, అభివృద్ధి ప్రణాళికల గురించి అడిగి తెలుసుకున్నారు.

News February 3, 2026

ఇంట్లో అదనపు దేవుడి విగ్రహాలు ఉంటే..?

image

ఇంట్లో అదనంగా ఉన్న దేవుడి విగ్రహాలు/ఫోటోలను పొరపాటున కూడా ఎక్కడ పడితే అక్కడ పారవేయకూడదు. దీనివల్ల దరిద్రం చుట్టుముట్టే ప్రమాదం ఉందని పండితులు చెబుతున్నారు. వాటిని భద్రంగా చూసుకోగలిగే వ్యక్తులకు ఇవ్వాలని సూచిస్తున్నారు. లేకపోతే సమీపంలోని ఆలయాలకు అప్పగించాలని అంటున్నారు. అది కూడా కుదరకపోతే పారే నదిలో వాటిని నిమజ్జనం చేయవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి.

News February 3, 2026

USతో అణు చర్చలకు సిద్ధమవుతున్న ఇరాన్

image

USతో అణు చర్చలకు ఇరాన్ సిద్ధమవుతోంది. ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ USతో చర్చలకు ఆదేశాలు ఇచ్చినట్లు ఫార్స్ వార్తా సంస్థను ఉటంకిస్తూ AFP పేర్కొంది. ఏ తేదీన ఇవి జరుగుతాయో చెప్పలేదు. కాగా US ఇరాన్‌పై దాడిచేస్తే అది ప్రాంతీయ యుద్ధంగా మారుతుందని ఇరాన్ ‘సుప్రీం’ ఖమేనీ నిన్న హెచ్చరించారు. దీనిపై స్పందిస్తూ ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ పేర్కొనడంతో తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి.