News September 24, 2024
BISలో 315 ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ప్రభుత్వ రంగ సంస్థ బ్యూరో స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియాలో 315 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. సీనియర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, పర్సనల్ అసిస్టెంట్ విభాగాల్లో ఖాళీలున్నాయి. అభ్యర్థులు SEP 30వ తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. విద్యార్హత, వయో పరిమితి, జీతభత్యాల వివరాల కోసం ఈ <
Similar News
News November 14, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 4

18. నిద్రలో కూడా కన్ను మూయనిది?(జ.చేప)
19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు?(జ.అస్త్రవిద్యచేత)
20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?(జ.యజ్ఞం చేయుట వలన)
21. జన్మించినా ప్రాణం లేనిది?(జ.గుడ్డు)
22. రూపం ఉన్నా హృదయం లేనిది?(జ.రాయి)
23. మనిషికి దుర్జనత్వం ఎలా వస్తుంది?(జ.శరణుకోరిన వారిని రక్షించకపోతే)<<-se>>#YakshaPrashnalu<<>>
News November 14, 2025
IND vs SA టెస్ట్.. తొలిరోజు స్కోర్ ఎంతంటే?

ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌత్ ఆఫ్రికాపై తొలి టెస్టులో భారత్ చెలరేగింది. తొలుత బ్యాటింగ్ చేసిన SAను 159కే ఆలౌట్ చేసింది. మార్క్రమ్(31), ముల్డర్(24), టోనీ(24), రికెల్టన్(23) ఫర్వాలేదనిపించారు. బుమ్రా 5, సిరాజ్, కుల్దీప్ చెరో 2, అక్షర్ 1 వికెట్ తీశారు. బ్యాటింగ్లో జైస్వాల్(12) అవుటవ్వగా.. KL రాహుల్(13*), సుందర్(6*) క్రీజులో ఉన్నారు. తొలిరోజు ఆటముగిసే సరికి IND ఒక వికెట్ నష్టానికి 37 రన్స్ చేసింది.
News November 14, 2025
జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు: రేవంత్

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు తమ బాధ్యతను పెంచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 51 శాతం ప్రజలు జూబ్లీహిల్స్ లో తమకు ఓటు వేశారని చెప్పారు. ‘గత అసెంబ్లీ ఎన్నికల్లో మాకు హైదరాబాద్లో సానుకూల ఫలితాలు రాలేదు. ప్రజలు మా తీరును గమనించి తీర్పును ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయి’ అని ధీమా వ్యక్తం చేశారు.


