News June 4, 2024

3,16,231 ఓట్ల ఆధిక్యంలో పెమ్మసాని

image

గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి డా. పెమ్మసాని చంద్రశేఖర్ రికార్డులు బద్దలు కొడుతున్నారు. ఆయన 3,16,231 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఆయనకు ఇప్పటి వరకు 7,64,321 ఓట్లు నమోదయ్యాయి. వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య 4,48,090 ఓట్లు నమోదయ్యాయి. మూడో స్థానంలో ఉన్న సీపీఐ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్‌కు 4,026 ఓట్లు వచ్చాయి.

Similar News

News November 23, 2025

తాడేపల్లి: వర్ల రామయ్యపై YCP నేతల ఫిర్యాదు

image

టీడీపీ నేత వర్ల రామయ్యపై వైసీపీ SC సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరు కనకరావు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. ఇటీవల YS జగన్ ACB కోర్టుకు వెళ్లిన సందర్భంలో బేగంపేట ఎయిర్పోర్ట్‌లో ఓ అభిమాని చూపిన ప్లకార్డును గురించి వర్ల ప్రెస్ మీట్ పెట్టి తమ పార్టీకి చెడ్డ పేరు వచ్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. అభిమానుల వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ నిర్ణయాలుగా చూపుతున్నారని విమర్శించారు.

News November 23, 2025

గుంటూరు: రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా శ్రీనివాసరావు

image

రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నామినేటెడ్ పదవుల కేటాయింపులో గుంటూరుకు ప్రాధాన్యత దక్కింది. ఈమేరకు రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కళ్యాణం శివ శ్రీనివాసరావు నియమితులయ్యారు. జనసేన పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ ఛైర్మన్‌గా ప్రస్తుతం ఆయన పని చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుడుగా పేరు పొందారు. ఆయన నియామకం పట్ల జనసేన పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

News November 23, 2025

గుంటూరులో నాన్ వెజ్ ధరలు ఇవే.!

image

గుంటూరులో నేటి నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ ధర కేజీ రూ.200, విత్ స్కిన్ రూ.180గా విక్రయిస్తున్నారు. మటన్ కేజీ ధర రూ.1050 పలుకుతోంది. ఇక చేపలు బొచ్చెలు, రాగండి ఇలా రకాలను బట్టి కేజీ రూ.200 నుంచి రూ.280 వరకు విక్రయాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు మీ ప్రాంతాల్లో నాన్ వెజ్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.