News December 31, 2025
31st నైట్ HYDలో ఈ రూట్లు బంద్

New Year వేడుకల నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈరోజు రాత్రి 11గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, PV మార్గ్, పలు ఫ్లైఓవర్‌లను పూర్తిగా నిలిపివేయనున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
Similar News
News January 3, 2026
హైదరాబాద్‌లో కొత్త జిల్లా ఇదే?

ఏంది భయ్యా.. మన జిల్లా మారుతుందంట కదా?.. ఇప్పుడు సిటీలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. పరిపాలనను పరుగులు పెట్టించేందుకు GHMC ప్రాతిపదికన జిల్లాల రీ-ఆర్గనైజేషన్‌కు స్కెచ్ వేస్తోంది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులను చెరిపేసి, ఆరు జోన్ల ఫార్ములాతో కొత్త రూపు ఇవ్వాలని చూస్తున్నారు. ఉప్పల్‌ను మల్కాజిగిరిలో కలిపి ఒక పక్కా ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీనిపై మీ కామెంట్?
News January 3, 2026
హైదరాబాద్‌లో అంతా ఆన్‌లైన్‌లోనే!

GHMCలో విలీనమైన ప్రాంతాల్లో ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ ఫీజుల చెల్లింపులు ఇకపై పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరగాలని GHMC స్పష్టం చేసింది. నగదు లావాదేవీలకు పూర్తిగా చెక్ పెట్టినట్లు ప్రకటించింది. UPI, డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్‌తో చెల్లింపులు స్వీకరిస్తామని తెలిపింది. కొత్త విధానానికి సహకరించాలని ప్రజలను విజ్ఞప్తి చేసింది. ఇకపై ఒకే పన్ను వసూలు విధానం అమల్లోకి వచ్చింది.
News January 3, 2026
HYD: కవిత వాహనాలపై చలానాల మోత

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాడుతున్న వాహనాలపై భారీగా ట్రాఫిక్ చలానాలు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. శుక్రవారం ఆమె శాసనమండలికి వచ్చిన మెర్సిడెస్ బెంజ్ కారుపై 6 చలానాలు ఉండగా, గతంలో వాడిన లెక్సస్ వాహనంపై 16 చలానాలు ఉన్నాయి. 22 సార్లు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించారు. అతివేగం, ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ వంటి కారణాలతో ఈ చలానాలు విధించారు. మొత్తం రూ.17,770 జరిమానా బకాయిలు ఉన్నట్లు సమాచారం.


