News December 16, 2025
32 కేసులను పరిష్కరించి కానిస్టేబుల్ ఉద్యోగాలిచ్చాం: CM

AP: ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు ఇస్తున్నామని కానిస్టేబుల్ సెలక్షన్ ఆర్డర్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు తెలిపారు. పోస్టుల కోసం కానిస్టేబుల్ అభ్యర్థులు 4 ఏళ్లుగా ఎదురుచూశారని, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో 32 కేసులు ఉంటే వాటిని పరిష్కరించి ఉద్యోగాలు ఇప్పించామని పేర్కొన్నారు. మెగా డీఎస్సీతో 15వేల ఉద్యోగాలు, ఇప్పుడు 6,014 మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలిచ్చామని వెల్లడించారు.
Similar News
News December 19, 2025
భారీ జీతంతో AVNL ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఆర్మ్‌డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్(AVNL) 6 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి BE, B.Tech, PG, PhD, డిప్లొమా, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉంటే JAN 6వరకు అప్లై చేసుకోవచ్చు. విద్యార్హత, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. కన్సల్టెంట్, Sr. కన్సల్టెంట్‌కు నెలకు రూ.1,20,000+IDA, Sr. మేనేజర్‌కు రూ.70000+IDA, Jr. మేనేజర్‌కు రూ.30,000+IDA చెల్లిస్తారు. వెబ్‌సైట్: avnl.co.in/
News December 19, 2025
నిత్య పూజ ఎలా చేయాలి?

నిత్య పూజ భగవంతుని పట్ల భక్తిని చాటుకునే ప్రక్రియ. దీనిని షోడశోపచార/పంచోపచార పద్ధతుల్లో చేయవచ్చు. స్నానం చేశాక శుభ్రమైన వస్త్రాలు ధరించి, దీపారాధనతో పూజ ప్రారంభించాలి. ముందుగా గణపతిని, ఆపై కులదైవాన్ని ధ్యానిస్తూ ఆవాహన, ఆసనం, స్నానం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. ఆఖరున హారతి ఇచ్చి, ఆత్మప్రదక్షిణ చేసి నమస్కరించుకోవాలి. పూజలో సామాగ్రి కంటే శుద్ధమైన మనస్సు, ఏకాగ్రత, భక్తి ముఖ్యం.
News December 19, 2025
మ్యాచ్ రద్దయితే ఫైనల్‌కు భారత్

అబుదాబీలో భారీ వర్షం కారణంగా భారత్-శ్రీలంక మధ్య జరగాల్సిన ఆసియా కప్ U-19 సెమీఫైనల్ మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. షెడ్యూల్ ప్రకారం ఉ.10.30 గంటలకే టాస్ పడాల్సి ఉంది. కాసేపట్లో అంపైర్లు పిచ్‌ను పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దయితే పాయింట్ల టేబుల్‌లో టాప్‌లో ఉన్న భారత్ ఫైనల్ చేరనుంది. మరో సెమీస్‌లో బంగ్లా, పాక్ తలపడనున్నాయి. ఇందులో గెలిచే జట్టుతో భారత్ ఫైనల్ ఆడుతుంది.


