News January 12, 2025

32 అంతస్తుల ఎత్తైన రాకెట్.. ప్రయోగానికి సిద్ధం

image

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు చెందిన ‘బ్లూ ఆరిజిన్’ సంస్థ ప్రారంభమైన 25 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు రాకెట్‌ను ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. 320 అడుగుల ఎత్తైన ఆ రాకెట్‌ను న్యూ గ్లెన్‌గా పిలుస్తున్నారు. అది సుమారు 32 అంతస్తుల భవనంతో సమానమని సంస్థ వర్గాలు వివరించాయి. అమెరికాలోని కేప్ కనవెరల్ రోదసి కేంద్రం నుంచి సోమవారం తెల్లవారుజాము ఒంటిగంటకు ఇది నింగిలోకి దూసుకుపోనుందని పేర్కొన్నాయి.

Similar News

News January 12, 2025

ఇంటింటికీ గ్యాస్ సరఫరా ప్రారంభించిన సీఎం

image

AP: సీఎం చంద్రబాబు తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్నారు. తిరుచానూరులో ఇంటింటికీ గ్యాస్ సరఫరాను ప్రారంభించారు. సీఎన్జీ వాహనాలను పరిశీలించారు. పలువురు న్యాచురల్ గ్యాస్ లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఓ ఇంట్లో స్టవ్ వెలిగించి స్వయంగా టీ చేసి సేవించారు. కాసేపట్లో ఆయన స్వగ్రామం నారావారిపల్లెకు వెళతారు. 3 రోజులపాటు అక్కడే కుటుంబసభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు.

News January 12, 2025

భోగి మంటల్లో వీటిని వేస్తున్నారా?

image

సంక్రాంతి పండుగలో భాగంగా భోగి మంటలు వేయడం ఆనవాయితీ. హోమాన్ని ఎంత పవిత్రంగా భావిస్తామో భోగి మంటను అంతే పవిత్రంగా భావించాలి. శుచిగా ఉన్న వ్యక్తి కర్పూరంతో భోగి మంట వెలిగించాలి. భోగి మంటల్లో పనికిరాని వస్తువులు, విరిగిన కుర్చీలు, టైర్లు, ప్లాస్టిక్ వస్తువులు, కవర్లు, పెట్రోల్, కిరోసిన్ వేయకూడదు. చెట్టు బెరడు, పిడకలు, కొబ్బరి ఆకులు, ఎండిన కొమ్మలు, ఆవు నెయ్యి, ఔషధ మొక్కలు వంటి వాటితో మండించాలి.

News January 12, 2025

కరుణ్ నాయర్ మళ్లీ సెంచరీ

image

విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ కెప్టెన్ <<15055540>>కరుణ్ నాయర్<<>> ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నాయర్ (122*) మరో సెంచరీ బాదారు. ఇప్పటికే ఈ టోర్నీలో నాలుగు సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే. 82 బంతుల్లోనే 13 ఫోర్లు, 5 సిక్సర్లతో 122 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. నాయర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో విదర్భ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.