News November 18, 2025

32,438 పోస్టులు.. పరీక్షలు వాయిదా

image

ఈ నెల 17 నుంచి DEC చివరి వారం వరకు జరగాల్సిన గ్రూప్-D పరీక్షలను వాయిదా వేసినట్లు RRB ప్రకటనలో తెలిపింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27 నుంచి 2026 జనవరి 16 వరకు నిర్వహిస్తామని వెల్లడించింది. ఎగ్జామ్ సిటీ, డేట్ వివరాలు రేపటి నుంచి <>వెబ్‌సైట్‌<<>>లో అందుబాటులోకి రానున్నాయి. పరీక్షలకు 4 రోజుల ముందు నుంచి ఈ-కాల్ లెటర్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. కాగా మొత్తం 32,438 పోస్టులను రైల్వేశాఖ భర్తీ చేయనుంది.

Similar News

News November 18, 2025

హనుమాన్ చాలీసా భావం – 13

image

సహస్ బదన్ తుమ్హారో యశగావై|
అసకహి శ్రీపతి కంఠ లగావై||
వేయి తలలు కలిగిన ఆదిశేషుడు కూడా ఆంజనేయుడి కీర్తిని గానం చేశాడు. శ్రీరాముడు ఆయనను ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు. ఈ నిష్కళంక సేవ, సాటిలేని భక్తి చాలా గొప్పది. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే ప్రశంసించి ఆలింగనం చేసుకోవడం భగవంతుని దయ, ప్రేమ పొందడానికి భక్తే ఉత్తమ మార్గమని, శ్రేయస్కరమని హనుమంతుడు నిరూపించాడు. <<-se>>#HANUMANCHALISA<<>>

BREAKING: భారీ అగ్ని ప్రమాదం

image

TG: మహబూబ్‌నగర్‌లోని గొల్లపల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సలార్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో మంటలు చెలరేగి ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.