News February 28, 2025
32,438 ఉద్యోగాలు.. దరఖాస్తులకు రేపే లాస్ట్

రైల్వేలో 32,438 గ్రూప్-డీ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. వాస్తవానికి ఈనెల 22నే గడువు ముగియాల్సి ఉండగా RRB మరో 7 రోజులు పొడిగించింది. మార్చి 4-13 వరకు ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది. టెన్త్ లేదా ITI పాసైన వారు అర్హులు. రిజర్వేషన్ను బట్టి వయో పరిమితిలో సడలింపు ఉంది. CBT, PET, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది.
సైట్: https://www.rrbapply.gov.in/
Similar News
News February 28, 2025
ALERT.. రేపటి నుంచి జాగ్రత్త

AP: విజయవాడ కమిషనరేట్ పరిధిలో రేపటి నుంచి కొత్త వాహన రూల్స్ అమల్లోకి రానున్నాయి. హెల్మెట్ లేకుండా బైక్ నడిపే వారికి, వెనుక కూర్చొని పెట్టుకోని వారికి, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడింగ్కు ₹1000, ఇన్సూరెన్స్ లేకపోతే ₹2000(తొలిసారి), రెండోసారి ₹4000, లైసెన్స్ లేకుండా బండి నడిపితే ₹5000, పొల్యూషన్ సర్టిఫికెట్ లేని వారికి ₹1500, ఫోన్ మాట్లాడుతూ బండి నడిపితే ₹1500 ఫైన్ వేస్తామని పోలీసులు హెచ్చరించారు.
News February 28, 2025
సెమీస్కు ఆస్ట్రేలియా

ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. 274 పరుగుల ఛేదనలో ఆస్ట్రేలియా 12.5 ఓవర్లలో 109 పరుగులు చేయగా మ్యాచుకు వర్షంతో ఆటంకం కలిగింది. ఈ క్రమంలో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ రాగా నాలుగు పాయింట్లతో ఆస్ట్రేలియా సెమీస్ చేరింది.
News February 28, 2025
రాహుల్ను ప్రధాని చేయడమే లక్ష్యం: రేవంత్

TG: రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేయడమే కాంగ్రెస్ నేతల లక్ష్యమని CM రేవంత్ అన్నారు. అప్పటివరకు కార్యకర్తలు విశ్రమించవద్దని చెప్పారు. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటివి అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉండి ఇన్ని చేస్తే కేంద్రంలోనూ అధికారంలోకి వస్తే ఇంకెన్ని చేయగలమో ఆలోచించాలని కార్యకర్తలకు సూచించారు.