News January 4, 2025
32,438 ఉద్యోగాలు.. BIG UPDATE
రైల్వేలో 32,438 గ్రూప్-డి ఉద్యోగాల భర్తీలో విద్యార్హతల్లో రైల్వే బోర్డు మార్పులు చేసింది. టెన్త్/ITI/నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన జాతీయ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ ఉన్న ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్ సహా పలు పోస్టులు భర్తీ చేస్తారు. ఈ నెల 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Similar News
News January 6, 2025
GOOD NEWS: వారంలో జాబ్ క్యాలెండర్?
AP: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు, కొత్తవి కలిపి దాదాపు 3వేల పోస్టుల భర్తీ జరగనుంది. గ్రూప్-1 పోస్టులతో పాటు వివిధ శాఖల్లో ఖాళీలను నింపనున్నారు. అటు వర్సిటీలు, RGUKTల్లోని 3వేల పోస్టులకు నోటిఫికేషన్లు రానున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రకటించిన మెగా DSC(16,347 పోస్టులు) నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
News January 6, 2025
ఈ కాల్స్‌కు స్పందించకండి: TG పోలీస్
అంతర్జాతీయ నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు తెలంగాణ పోలీసులు సూచించారు. +97, +85 కోడ్స్‌తో ఉన్న నంబర్ల నుంచి కాల్స్ వస్తే స్పందించవద్దని తెలిపారు. RBI, ట్రాయ్ పేరిట బెదిరిస్తూ సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని, ఫేక్ కాల్స్‌కు స్పందిస్తే బ్యాంకు అకౌంట్స్ ఖాళీ అవుతాయని హెచ్చరించారు. ఇలాంటి స్పామ్ కాల్స్‌పై 1930కి రిపోర్ట్ చేయాలని సూచించారు.
News January 6, 2025
పవన్‌ను అరెస్ట్ చేయాలి: వైసీపీ అధికార ప్రతినిధి
AP: Dy.CM పవన్‌ను అరెస్ట్ చేయాలని YCP అధికార ప్రతినిధి కె.వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన పవన్ బైక్ సైలెన్సర్లు తీసి యువకులు స్టంట్లు చేయాలని చెప్పారన్నారు. అందువల్లే ఆ ఈవెంట్‌కు వెళ్లొస్తూ ఇద్దరు యువకులు చనిపోయారని, వారి మృతికి కారణమైన ఆయన్ను అరెస్ట్ చేయాలన్నారు. అటు, TGలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతిచెందిన కేసులో బన్నీ అరెస్టైన విషయం తెలిసిందే.