News January 22, 2025
32,438 ఉద్యోగాలు.. పోస్టుల వారీగా

రైల్వేలో 32438 లెవల్-1 (గ్రూప్-డి) పోస్టులకు నిన్న నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో అత్యధికంగా 13187 ట్రాక్ మెయింటెనర్, 5058 పాయింట్స్‌మన్-B, 3077 అసిస్టెంట్ (వర్క్ షాప్), 2587 అసిస్టెంట్ (C&W), 2012 అసిస్టెంట్ (S&T), 1381 అసిస్టెంట్ TRD ఉద్యోగాలు ఉన్నాయి. టెన్త్ పాస్ లేదా ఐటీఐ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. పూర్తి వివరాలకు ఇక్కడ <
Similar News
News October 25, 2025
సౌదీకి సైన్యాన్ని అద్దెకివ్వనున్న పాకిస్థాన్

ఇటీవల పాకిస్థాన్, సౌదీ మధ్య రక్షణ ఒప్పందం కుదరడం తెలిసిందే. ఎవరు దాడి జరిపినా ఇరు దేశాలూ ఎదుర్కోవాలని నిర్ణయించాయి. అయితే దీనిలో అసలు రహస్యం పాకిస్థాన్ తన సైన్యాన్ని అద్దెకు ఇవ్వనుండడం. 25వేల మంది సైనికుల్ని పాక్ సౌదీకి పంపనుంది. దానికి ప్రతిగా సౌదీ ₹88వేల CR ప్యాకేజీని పాక్‌కు అందిస్తుంది. పాక్ ఇప్పటికే రాజకీయ, ఆర్థిక సంక్షోభంతో అనేక రుణాలు తీసుకుంటోంది. అవీ సరిపోక ఈ అద్దె విధానాన్ని ఎంచుకుంది.
News October 25, 2025
భారత్ త్రిశూల విన్యాసాలు.. పాక్ నోటమ్ జారీ

పాక్ బార్డర్‌లోని సర్ క్రీక్ ప్రాంతంలో ఈనెల 30 నుంచి NOV 10 వరకు భారత త్రివిధ దళాలు త్రిశూల సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న భారత్ NOTAM జారీ చేసింది. దీంతో పాక్ కూడా తమ సెంట్రల్, సదరన్ ఎయిర్‌స్పేస్‌లలో విమానాల రాకపోకలను రద్దు చేస్తూ నోటమ్ జారీ చేసింది. ఇందుకు ప్రత్యేకంగా కారణాలేవీ వెల్లడించలేదు. కాగా త్రిశూల విన్యాసాల వెనుక భారత వ్యూహమేంటని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
News October 25, 2025
ఆస్ట్రేలియా ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో AUS 236 రన్స్‌కు ఆలౌట్ అయింది. 124-2తో పటిష్ఠ స్థితిలో ఉన్న కంగారూలు భారత బౌలర్ల ధాటికి కుప్పకూలారు. మార్ష్ 41, హెడ్ 29, షార్ట్ 30, రెన్షా 56, క్యారీ 24, కూపర్ 23 రన్స్ చేశారు. మన బౌలర్లలో రాణా 4, సుందర్ 2, సిరాజ్, అక్షర్, ప్రసిద్ధ్, కుల్దీప్ తలో వికెట్ పడగొట్టారు. కాసేపట్లో 237 టార్గెట్‌తో భారత్ బరిలోకి దిగనుంది. IND వైట్‌వాష్ నుంచి తప్పించుకుంటుందా? COMMENT


