News September 8, 2025

32,438 పోస్టులు.. పరీక్షలు ఎప్పుడంటే?

image

రైల్వేలో 32,438 గ్రూప్-D పోస్టుల భర్తీకి <<15529908>>RRB<<>> నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు నవంబర్ 17 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షలకు 10 రోజుల ముందు ఎగ్జామ్ సెంటర్, డేట్ వంటి వివరాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. అభ్యర్థులు అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు అధికారిక <>వెబ్‌సైట్‌ను<<>> ఫాలో కావాలని సూచించింది.

Similar News

News September 9, 2025

ఓటమిపై స్పందించిన సుదర్శన్ రెడ్డి

image

ఉపరాష్ట్రపతి ఎన్నిక ఫలితంపై ఇండీ కూటమి అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డి స్పందించారు. ‘ఫలితాలు నాకు అనుకూలంగా రాలేదు. ప్రజాస్వామ్యంలో గెలుపే కాదు.. ఓటమినీ స్వీకరించాలి. మరింత బలంగా సైద్ధాంతిక పోరాటం కొనసాగిస్తా’ అని తెలిపారు. కాగా ఫలితాల్లో NDA అభ్యర్థి రాధాకృష్ణన్‌కు 452, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పోలయ్యాయి.

News September 9, 2025

ప్చ్.. ఓటేయడం రాని నేతలను ఎన్నుకున్నాం!

image

ఉపరాష్ట్రపతి ఎన్నికలో 15 మంది MPల <<17659975>>ఓట్లు<<>> చెల్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులకే ఓటు వేయరాకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నేతలను ఎన్నుకొని ఏం లాభమని అంటున్నారు. ఈ 15 ఓట్లతో ఫలితం మారకున్నా మెజార్టీపై ప్రభావం పడేది. గతంలో TGలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో భారీగా గ్రాడ్యుయేట్ల ఓట్లు చెల్లకపోవడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మీ కామెంట్?

News September 9, 2025

ఏడాది క్రితమే ఈవీఎంల వినియోగంపై కమిటీ: SEC సాహ్ని

image

AP: ఏడాది క్రితమే ఈవీఎం‌ల వినియోగం‌పై ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసిందని SEC నీలం సాహ్ని తెలిపారు. ‘S-3 మోడల్‌ ఈవీఎం‌లో మెమరీ డ్రైవ్ తీసి వెంటనే మరొక చోట వాడుకునే అవకాశం ఉంటుంది. రాబోయే ఎన్నికల కోసం 41,301 కంట్రోల్ యూనిట్లు, 82,602 బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతాయి. 10,670 M-2 మోడల్ ఈవీఎంలు ఇప్పటికే మనవద్ద ఉన్నాయి. ఒకవేళ ఈవీఎంలు అవసరమైతే పక్క రాష్ట్రాల నుంచి తీసుకోవచ్చు’ అని పేర్కొన్నారు.