News December 2, 2024
భారీ జీతంతో 334 ఉద్యోగాలు

NLC ఇండియా లిమిటెడ్లో 334 పోస్టులకు ఈ నెల 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, జనరల్ మేనేజర్, అడిషనల్ చీఫ్ ఇంజినీర్ పోస్టులున్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తిచేసిన వారు అర్హులు. పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పే స్కేల్ రూ.50,000-2,80,000 మధ్య ఉంటుంది. పూర్తి వివరాల కోసం <
సైట్: https://www.nlcindia.in/
Similar News
News January 30, 2026
ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్కు జకోవిచ్

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్లో జకోవిచ్ అద్భుతమైన విజయం సాధించారు. డిఫెండింగ్ ఛాంపియన్ జానిక్ సిన్నర్తో జరిగిన 5 సెట్ల హోరాహోరీ పోరులో 3-6, 6-3, 4-6, 6-4, 6-4 తేడాతో గెలుపొందారు. రెండేళ్ల తర్వాత సిన్నర్పై విజయం సాధించిన జకోవిచ్.. కెరీర్లో 11వ సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్కు చేరుకున్నారు. ఆదివారం జరగనున్న తుది పోరులో ప్రపంచ నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్తో తలపడనున్నారు.
News January 30, 2026
ఫ్యూచర్ ట్రేడింగ్.. వెండి, గోల్డ్ రేటు భారీ పతనం

విపరీతంగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు ఇవాళ <<19003989>>పతనమయ్యాయి<<>>. ఇది క్రమంగా కొనసాగే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఫ్యూచర్ ట్రేడింగ్(MAR)లో KG వెండి రేటు ₹67,891 తగ్గి(16.97%) ₹3.32 లక్షలకు చేరింది. గోల్డ్ కూడా(FEB) 10 గ్రాములు ₹15,246 తగ్గి(9%) ₹1,54,157 పలికింది.
* భవిష్యత్తులో ఓ తేదీన ముందుగా నిర్ణయించిన ధరకు స్టాక్స్/కమోడిటీల కొనుగోలు లేదా విక్రయానికి చేసుకునే ఒప్పందాన్ని ఫ్యూచర్ ట్రేడింగ్ అంటారు.
News January 30, 2026
DyCMగా అజిత్ పవార్ భార్య.. రేపే ప్రమాణం!

మహారాష్ట్ర DyCMగా అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రేపు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ఆమె పేరును ఖరారు చేసేందుకు రేపు మధ్యాహ్నం 2 గంటలకు ముంబైలో లెజిస్లేటివ్ పార్టీ సమావేశం నిర్వహించనున్నారని NCP వర్గాలు తెలిపాయి. ఇదే జరిగితే MH తొలి మహిళా DyCMగా సునేత్ర రికార్డు సృష్టించనున్నారు. ప్రస్తుతం ఆమె MPగా ఉన్నారు. <<18980385>>విమాన ప్రమాదంలో<<>> అజిత్ మరణించడం తెలిసిందే.


