News October 13, 2024

ఇజ్రాయెల్ చర్యలను ఖండించిన 34 ప్రపంచ దేశాలు

image

లెబ‌నాన్‌లోని UN శాంతిప‌రిర‌క్ష‌ణ బ‌ల‌గాల స్థావ‌రాలపై ఇజ్రాయెల్ దాడుల‌ను భార‌త్‌తోపాటు 34 ప్రపంచ దేశాలు ఖండించాయి. ఇలాంటి చ‌ర్య‌ల‌ను వెంట‌నే విర‌మించుకోవాల‌ని సంయుక్త ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాయి. ఇటీవ‌ల ద‌క్షిణ లెబ‌నాన్‌పై ఇజ్రాయెల్ జ‌రిపిన‌ దాడుల్లో ఐదుగురు శాంతి పరిరక్షకులు గాయపడ్డారు. ఈ దాడుల్ని ఉద్దేశ‌పూర్వ‌క చ‌ర్య‌లుగా UNIFIL ఆరోపించింది. బ‌ల‌గాల ర‌క్ష‌ణ అత్యంత ప్రాధాన్యాంశంగా భార‌త్ పేర్కొంది.

Similar News

News December 30, 2024

Good News: ఎయిడ్స్ టీకాకు USFDA ఆమోదం

image

ఎప్పుడెప్పుడా అని ప్రపంచమంతా ఎదురుచూస్తున్న HIV/AIDS వ్యాక్సిన్ వచ్చేసింది. గిలీడ్ సైన్సెస్ రూపొందించిన Lenacapavirకు USFDA అనుమతి ఇచ్చింది. మూడేళ్లలోనే ఈ టీకా 20 లక్షల మందికి చేరనుంది. ఎయిడ్స్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న దక్షిణాఫ్రికా, టాంజానియాలో నిర్వహించిన ట్రయల్స్‌లో మంచి ఫలితాలు వచ్చాయని తెలిసింది. ఏడాదికి 2సార్లు తీసుకోవాల్సిన ఈ టీకా ఖరీదు సామాన్యులకు అందుబాటులో ఉండదన్న ఆందోళన నెలకొంది.

News December 30, 2024

ఎయిడ్స్‌తో ఇప్పుడు ఎందరు బతుకుతున్నారంటే..

image

HIV/AIDSను 1983లో మొదటిసారి అమెరికాలో గుర్తించారు. అక్కడి నుంచి అన్ని దేశాలకు పాకేసింది. ప్రపంచానికి ఇదో పెనుముప్పుగా మారడంతో ‘ఎయిడ్స్‌కు మందు లేదు. నివారణే మార్గం’ అన్న నినాదం పుట్టుకొచ్చింది. HIV సోకి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4.2 కోట్ల మంది చనిపోయారని అంచనా. మొత్తంగా 8.8 కోట్ల మందికి సోకింది. 2023 చివరి నాటికి 4 కోట్ల మంది ఎయిడ్స్‌తోనే బతుకుతున్నారు. ఎట్టకేలకు వ్యాక్సిన్ రావడం భారీ ఊరట.

News December 30, 2024

ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువలు పెంపు: మంత్రి

image

APలో ఫిబ్రవరి 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఎక్కడ భూమి రేట్లు బాగా పెరిగాయో అక్కడ మాత్రమే రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతామన్నారు. భూమి విలువల కంటే రిజిస్ట్రేషన్ విలువలు అధికంగా ఉన్న చోట రిజిస్ట్రేషన్ విలువలను తగ్గిస్తామని చెప్పారు. విలువలు పెరిగే చోట సగటున 15 నుంచి 20 శాతం వరకు పెంపుదల ఉంటుందని పేర్కొన్నారు.