News June 13, 2024
35ఏళ్లకు ‘నూజివీడు’కు మంత్రి పదవి

35ఏళ్ల తర్వాత ‘నూజివీడు’కు మంత్రి పదవి దక్కింది. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. 1952-72 వరకు వరుసగా 5సార్లు MLAగా గెలిచిన డా.ఎంఆర్ అప్పారావు, తర్వాత 1978, 1989లో గెలుపొందిన పాలడుగు వెంకటరావు మాత్రమే మంత్రులుగా పని చేశారు. ఇన్నేళ్ల తర్వాత తాజాగా కొలుసు పార్థసారథికి మంత్రి పదవి దక్కింది. రాజకీయ నేపథ్యమున్న కుటుబం నుంచి వచ్చిన కొలుసు.. 2009లో YSR, కిరణ్ కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు.
Similar News
News December 15, 2025
యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్‌లో, మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. అధికారులు అందుబాటులో ఉండి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యాలయానికి రాలేనివారు 1100 కాల్ సెంటర్ ద్వారా లేదా Meekosam వెబ్‌సైట్‌లో సమస్యలను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News December 14, 2025
పాలకొల్లులో వైసీపీ రాష్ట్ర నేతకు సీఐడీ నోటీసులు

వైసీపీ రాష్ట్ర అంగన్వాడీ విభాగం ఉపాధ్యక్షురాలు మద్దా చంద్రకళకు సీఐడీ అధికారులు పాలకొల్లులో నోటీసులు అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో 2022లో పాలకొల్లు టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ కేసు దర్యాప్తులో భాగంగా తనకు ఈ నోటీసులు ఇచ్చారని, ఈ నెల 15న రాజమండ్రిలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరవుతున్నట్లు చంద్రకళ తెలిపారు.
News December 13, 2025
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయి: కలెక్టర్

గోదావరి క్రీడోత్సవాల్లో భాగంగా శనివారం భీమవరం ఎస్ఆర్ కెఆర్ ఇంజినీరింగ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం డివిజన్ ఉద్యోగుల క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..గోదావరి క్రీడోత్సవాల్లో భాగంగా నేటి నుంచి జిల్లావ్యాప్తంగా రెవెన్యూ డివిజన్ల వారీగా పోటీలు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని అన్నారు.


