News April 4, 2024

జూనియర్ ఉద్యోగులకు 35-45% జీతాలు పెరగొచ్చు: పేజ్ గ్రూప్

image

ఈ ఏడాది ఐటీ అండ్ టెక్ రంగంలో జూనియర్ ఉద్యోగులకు 35-45 శాతం వరకు జీతాలు పెరగొచ్చని ‘మైకేల్ పేజ్ ఇండియా శాలరీ గైడ్’ నివేదిక వెల్లడించింది. మధ్యశ్రేణి వారికి 30-40 శాతం, సీనియర్లకు 20-30 శాతం వరకు పెంపు ఉంటుందని చెప్పింది. నైపుణ్యం, నూతన ఆవిష్కరణలపై కంపెనీలు దృష్టిసారించాయని తెలిపింది. వివిధ రంగాల్లో డేటా అనలిటిక్స్, జెనరేటివ్ ఏఐ, మెషీన్ లెర్నింగ్‌లో నైపుణ్యం ఉన్నవారి అవసరం పెరిగిందని పేర్కొంది.

Similar News

News November 27, 2025

సారీ.. అంచనాలు అందుకోలేకపోయాం: పంత్

image

తాము సరిగ్గా ఆడలేదని ఒప్పుకోవడానికి సిగ్గు పడట్లేదని కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపారు. ‘జట్టుగా, వ్యక్తిగతంగా మేమెప్పుడూ హయ్యెస్ట్ లెవల్లో పర్ఫార్మ్ చేసి కోట్లమంది భారతీయుల ముఖాల్లో చిరునవ్వు తేవాలనుకుంటాం. ఈసారి ఆ అంచనాలను అందుకోలేకపోయినందుకు క్షమించండి. దేశానికి ప్రాతినిధ్యం వహించడం మాకు గర్వకారణం. ఈ జట్టు ఏం చేయగలదో మాకు తెలుసు. ఈసారి జట్టుగా, వ్యక్తిగతంగా మంచి కంబ్యాక్ ఇస్తాం’ అని ట్వీట్ చేశారు.

News November 27, 2025

భారీ వర్షాలు.. రైతులకు కీలక సూచనలు

image

భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రైతులకు కొన్ని సూచనలు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల వరి కోతల సీజన్ నడుస్తోంది. కోత పూర్తైన వరి పంటను/ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రైతులకు సూచించింది. ధాన్యాన్ని కుప్పలుగా పోసి టార్పాలిన్ కప్పాలని, ఒకవేళ వానకు ధాన్యం తడిస్తే రంగుమారకుండా, మొలకెత్తకుండా వ్యవసాయ నిపుణుల సూచనలు పాటించాలని కోరింది.

News November 27, 2025

30 రోజుల్లో 1400 భూకంపాలు

image

ఇండోనేషియాలో గత 30 రోజుల్లో 1,400కు పైగా భూకంపాలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా సుమత్రా దీవిలో 6.3 తీవ్రతతో భూకంపం రాగా.. ఆషే ప్రావిన్స్ సమీపంలో 10 కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇప్పటికే సైక్లోన్ సెన్యార్‌ కారణంగా సుమత్రా దీవిలో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి 25 మంది మృతి చెందారు. ఇండోనేషియా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌పై ఉండడం వల్ల తరచూ భూకంపాలు వస్తుంటాయి.