News September 18, 2024

ఓటీటీలోకి ’35 చిన్న కథ కాదు’.. ఎప్పుడంటే?

image

ఈనెల 6న థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న ’35 చిన్న కథ కాదు’ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈనెల 27 నుంచి ‘ఆహా’లో ఈ మూవీ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నందకిశోర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియదర్శి, విశ్వదేవ్, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు.

Similar News

News November 17, 2025

బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో 31 కృష్ణ జింకలు మృతి

image

కర్ణాటకలోని కిత్తూరు రాణి చెన్నమ్మ జూలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో 4 రోజుల్లో 31 కృష్ణ జింకలు మృతి చెందాయి. దీనిపై దర్యాప్తుకు ఆదేశించినట్లు అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకడంతో జూ అధికారులు, వెటర్నరీ వైద్యులు ట్రీట్మెంటు అందించారని చెప్పారు. ఇతర జూలకు అది వ్యాపించకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు. బాక్టీరియా వ్యాప్తికి కారణం తెలుసుకొనేందుకు నిపుణుల బృందాన్ని పంపామన్నారు.

ESIC ఆల్వార్‌లో 252 పోస్టులు

image

రాజస్థాన్ ఆల్వార్‌లోని ESIC 252టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 24, 25 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PWBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in/