News August 3, 2024
ఓలా IPOకు తొలిరోజు 35 శాతం బిడ్లు

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఐపీవోకు తొలి రోజు 35 శాతం బిడ్లు దాఖలయ్యాయి. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 20 శాతం సబ్స్క్రిప్షన్ అందుకుంది. క్వాలిఫైడ్ బిడ్డర్ల కోటా 25.22 కోట్ల షేర్లు కాగా, కేవలం 1.44 లక్షల షేర్లకే బిడ్స్ లభించాయి. రూ.6,145 కోట్ల సమీకరణకు వచ్చిన ఈ ఐపీవోలో ఒక్క షేర్ ధర రూ.72-76గా నిర్ణయించారు. ఈ నెల 6తో సబ్స్క్రిప్షన్ గడువు ముగియనుంది.
Similar News
News April 1, 2026
ఇరాన్ యుద్ధం.. అమెరికాతో విభేదించిన బ్రిటన్

ఇరాన్ యుద్ధం విషయంలో <<19525908>>అమెరికా<<>>తో బ్రిటన్ విభేదించింది. ఈ ఘర్షణల్లోకి ప్రవేశించేది లేదని PM స్టార్మర్ తేల్చి చెప్పారు. యుద్ధంతో సంబంధం లేనప్పటికీ.. తమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఘర్షణల్ని ఆపేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు. హార్ముజ్ పున:ప్రారంభానికి ఉన్న మార్గాల్ని అన్వేషించేందుకు గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామని తెలిపారు.
News April 1, 2026
7.30 గంటల నిడివితో ధురంధర్!

కంటెంట్, అధిక రన్ టైమ్తో ప్రేక్షకులను థ్రిల్ చేసిన ‘ధురంధర్’ మేకర్స్ మరో సంచలనానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. రెండు పార్టులు కలిపి 7 గంటల 30 నిమిషాల నిడివితో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన CBFC సర్టిఫికెట్ SMలో వైరలవుతోంది. OTTలో విడుదల చేస్తారా? థియేటర్లలో స్పెషల్ షోలు వేస్తారా? అనేది క్లారిటీ లేదు. గతేడాది ‘బాహుబలి: ది ఎపిక్’ 3 గంటల 44 నిమిషాలతో రిలీజైన విషయం తెలిసిందే.