News September 1, 2025
డిగ్రీ అర్హతతో LICలో 350 ఉద్యోగాలు

LICలో 350 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(AAO) పోస్టులకు ఈ నెల 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ అర్హత, 21-30 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వేతనం నెలకు ₹88,635-₹1,69,025 ఉంటుంది. ఈ ఏడాది OCT 3న ప్రిలిమ్స్, NOV 8న మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: <
Similar News
News September 23, 2025
ఎమ్మెల్యేలు నెలకోరోజు పొలాలకు వెళ్లండి: చంద్రబాబు

AP: వ్యవసాయంపై శాసనసభ్యులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. అక్టోబర్ నుంచి నెలకో రోజు పొలాలకు వెళ్లాలని అసెంబ్లీలో సభ్యులకు తెలిపారు. రైతులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు. త్వరలో తానూ అన్నదాతల్ని కలుస్తానని పేర్కొన్నారు. పంట ధరలు తగ్గితే ఆదుకుంటున్నామని వెల్లడించారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించేందుకు భూసార పరీక్షలు చేసి సూక్ష్మపోషకాలు అందిస్తామన్నారు.
News September 23, 2025
రాష్ట్రంలో భిన్న వాతావరణం

TG: గత 4-5 రోజులుగా రాష్ట్రంలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. పొద్దంతా ఎండ, ఉక్కపోతగా ఉంటూ సాయంత్రం వర్షం కురుస్తోంది. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు వర్షం కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న యాదాద్రిలోని పాముకుంటలో 11.3cm, HYDలోని షేక్‌పేటలో 10.1cm, శ్రీనగర్ కాలనీలో 9.55cmల వర్షపాతం నమోదైంది. రాబోయే 2రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD తెలిపింది.
News September 23, 2025
ASIA CUP: ఇవాళ రెండు జట్లకు చావోరేవో

సూపర్-4లో భాగంగా ఇవాళ 8PMకు పాక్, శ్రీలంక తలపడనున్నాయి. ఇరు దేశాలకు ఇది చావోరేవో మ్యాచ్. ఇప్పటికే బంగ్లాదేశ్ చేతిలో శ్రీలంక, ఇండియా చేతిలో పాక్ ఓడిపోయాయి. దీంతో ఇవాళ ఓడిన జట్టు దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. గెలిచిన జట్టు తమ చివరి మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే ఫైనల్‌కు వెళ్తుంది. మరోవైపు రేపు బంగ్లాను భారత్ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ నేరుగా తుది పోరుకు అర్హత సాధిస్తుంది.