News October 17, 2024

3,500 జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగాలు.. ఈ నెలలోనే నోటిఫికేషన్లు?

image

TG: TGSPDCL, TGNPDCLలో 3,500 జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగాలకు ఈ నెలలోనే నోటిఫికేషన్లు జారీ చేసేందుకు డిస్కంలు సిద్ధం అవుతున్నాయి. JLMతో పాటు 50 వరకు అసిస్టెంట్ ఇంజినీర్ (AE) పోస్టులకు కూడా TGSPDCL నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎస్సీ వర్గీకరణ అంశం నేపథ్యంలో ముందుగా నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ నాటికి ప్రభుత్వ నిర్ణయం మేరకు ముందుకెళ్లే అవకాశం ఉంది.

Similar News

News November 10, 2025

భోజనం చేసిన వెంటనే ఈ 5 పనులు చేయొద్దు!

image

భోజనం చేసిన వెంటనే కొన్ని పనులు చేయవద్దని, దానివల్ల ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు.
*స్నానం చేయవద్దు. దీనివల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. 2 గంటల తర్వాత స్నానం చేయవచ్చు.
*వెంటనే నిద్రపోవద్దు. 20 నిమిషాల పాటు నడవాలి.
*చల్లటి నీరు తాగవద్దు. గోరువెచ్చని లేదా జీలకర్ర-ధనియాల కషాయం తాగాలి.
*తిన్న వెంటనే పండ్లు తినవద్దు. గంట ముందు లేదా 2 గంటల తర్వాత తినొచ్చు.
*వ్యాయామం చేయవద్దు.

News November 10, 2025

ఢిల్లీ పేలుడు.. విచారణకు ఆదేశించిన హోంమంత్రి

image

ఢిల్లీ పేలుడుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్, ఢిల్లీ సీపీతో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇప్పటికే NSG, NIA టీమ్స్ ఘటనాస్థలికి చేరుకున్నాయి. అటు పేలుడులో 8 మంది మరణించగా, 24 మందికి తీవ్రగాయాలయ్యాయి. కార్లు, దుకాణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎర్రకోట వద్ద భీతావహ వాతావరణం నెలకొంది.

News November 10, 2025

రహదారి పక్కన ఇంటి నిర్మాణానికి నియమాలు

image

రహదారి పక్కనే ఇల్లు కట్టుకుంటే, ఆ దారి కొలతకు ఇంటి పొడవు రెండింతల కంటే ఎక్కువ ఉండకూడదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తారు. ఈ నియమం ఇంటికి, బయటి శక్తి ప్రవాహానికి మధ్య సమతుల్యతను నెలకొల్పుతుందని అంటారు. ‘ఇంటి పొడవు అధికంగా ఉంటే.. అది రోడ్డు నుంచి వచ్చే చంచల శక్తిని ఎక్కువగా ఆకర్షించి, ఇంట్లో స్థిరత్వాన్ని తగ్గిస్తుంది. గృహంలో ప్రశాంతత ఉండాలంటే ఈ నియమం పాటించాలి’ అని తెలుపుతున్నారు. <<-se>>#Vasthu<<>>