News January 7, 2026

354కి చేరిన AQ.. HYDలో జర భద్రం

image

HYDలో ఎయిర్ క్వాలిటీ మరొకసారి తారస్థాయికి చేరింది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతూ వస్తోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్‌క్వాలిటీ బుధవారం బడంగ్‌పేట్‌లో తెల్లవారుజామున 354కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటీస్, డస్ట్ అలర్జీ ఉన్నవారితో పాటు సామాన్యులూ మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గతవారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ ఇవాళ భారీగా పెరిగింది.

Similar News

News February 17, 2026

సర్వే 2026 రికార్డుల్లో నిగూఢ నినిదాలు.. బఫర్ జోన్ మార్కింగ్‌లో మెలిక!

image

హైదర్షాకోట్-అత్తాపూర్ వరకు ఎర్ర గీతల వెనుక ఉన్న ‘టెక్నికల్’ చిక్కుముడి. మున్సిపల్ శాఖ జారీ చేసిన తాజా ఇంటర్నల్ సర్క్యులర్ ప్రకారం.. మూసీ గరిష్ట వరద మట్టం గుర్తింపులో కొత్త సాఫ్ట్‌వేర్ వాడుతున్నారని తెలిసింది. ఇక్కడే చట్టపరమైన చిక్కుముడి ఉంది. దశాబ్దాల క్రితం ఉన్న రెవెన్యూ మ్యాపులకు ఇప్పటి గూగుల్ శాటిలైట్ మ్యాపులకు పొంతన కుదరడం లేదు. వందలాది ‘లీగల్’ ప్రాపర్టీలు కూడా బఫర్ జోన్‌లోకి వస్తున్నాయి.

News February 17, 2026

GNT: తపాలా శాఖపై పెమ్మసాని సమీక్ష

image

గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తపాలా శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ, ఏపీ సహా పలు సర్కిళ్ల పనితీరును పరిశీలించారు. తెలంగాణ సర్కిల్ ఉత్తమ ఫలితాలు సాధించిందని ప్రత్యేకంగా ప్రశంసించారు. మిగిలిన సర్కిళ్లు ‘టెక్-ఫస్ట్’ విధానాన్ని పాటించాలని సూచించారు. వినియోగదారుల సంతృప్తే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణతో సేవలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

News February 17, 2026

రాగి పంటకు నీరు అందించడంలో జాగ్రత్తలు

image

రాగి పంటకు నీటిని అందించే విషయంలో రైతులు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. నాట్లు వేసిన రాగి పొలంలో పైరు బాగా వేర్లు తొడిగే వరకు అంటే సుమారు 10 రోజుల వరకు నీరు పెట్టకూడదని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. రాగి పంట సాధారణంగా వర్షాధార పంట అయినప్పటికీ కీలక దశలైన మొలకెత్తే దశ, పూత, గింజ పాలు పోసుకునే దశల్లో నీటి తడులను ఇస్తే దిగుబడి బాగుంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.