News September 26, 2024
పదేళ్లలో ఏపీకి రూ.35,491 కోట్ల కేంద్ర నిధులు

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం కింద ఏపీకి 2014-24 మధ్య కాలంలో రూ.35491.57 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఆర్టీఐ కార్యకర్త రవికుమార్ అడిగిన మేరకు కేంద్రం బదులిచ్చింది. పదేళ్లలో ఆర్థిక లోటు భర్తీ కింద రూ.16,078.76 కోట్లు, ఏడు వెనకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.1,750 కోట్లు, రాజధాని నగరంలో మౌలిక వసతుల డెవలప్మెంట్కు రూ.2,500 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.15,147 కోట్లు ఇచ్చినట్లు పేర్కొంది.
Similar News
News November 18, 2025
శ్రీవారి ఫిబ్రవరి కోటా టోకెన్లు.. ఎప్పుడంటే?

AP: రేపు ఉ.10 గంటలకు ఆన్లైన్ ఆర్జిత సేవా డిప్ విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ నెల 20 ఉ.10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. 21న మ.3 గంటలకు వర్చువల్ సేవా, 24న ఉ.10 గంటలకు అంగప్రదక్షిణం, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శనం, మ.3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శనం, 25న ఉ.10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శన కోటా, మ.3 గంటల వసతి గదుల కోటా రిలీజ్ చేయనుంది. మరిన్ని వివరాలకు ఇక్కడ <

ఇతరులకు ఇబ్బంది కలిగించకపోతేనే వాస్తు ఫలితాలు

మనం మన పరిధిలో, ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వాస్తును దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపట్టాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. కేవలం మన సౌకర్యమే కాక, సామాజిక ధర్మాన్ని కూడా పాటించడం ముఖ్యమంటున్నారు. ఇతరుల హక్కులకు భంగం కలగకుండా నిర్మాణాలు చేయడం వల్ల శాస్త్రరీత్యా, ధర్మబద్ధంగా అందరికీ శుభం, శ్రేయస్సు కలుగుతుందని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>