News June 4, 2024
37వేల మెజారిటీతో కాల్వ ఘన విజయం

రాయదుర్గం టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించారు. కాల్వ శ్రీనివాసులు మొదటి రౌండ్ నుంచి ఆధిక్యత కనబరుస్తూ ముందంజలో దూసుకెళ్లారు. వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డిపై 22 రౌండ్లు పూర్తయ్యేసరికి 37,268 ఓట్ల తేడాతో గెలుపొందారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇంకా కలపాల్సి ఉంది.
Similar News
News December 8, 2025
అనంత: ఈనెల 21న పల్స్ పోలియో.!

ఈనెల 21న వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అనంత జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సోమవారం ఆదేశించారు. జిల్లాలో 2,84,774 మంది చిన్నారులు ఉన్నారు. వీరందరికీ పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తెలిపారు. జిల్లాలోని 82 యూనిట్లలో కార్యక్రమం జరుగుతుందని అధికారులు వెల్లడించారు.
News December 8, 2025
అనంత: అనాధ పిల్లలకు హెల్త్ కార్డుల పంపిణీ

అనాధ పిల్లల కోసం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం జిల్లాలోని అనాధ పిల్లలకు హెల్త్ కార్డులను తయారు చేయించింది. అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఈ కార్డులను పంపిణీ చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఈ సేవను అందిస్తున్న సంగతి తెలిసిందే.
News December 8, 2025
అనంత: ఈనెల 10లోపు టెట్.!

అనంతపురంలో ఈనెల 10 నుంచి 21 వరకు TET పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎంపిక చేసిన 7 కేంద్రాల్లో సెషన్ వన్ ఉదయం 9.30 నుంచి 12 వరకు, సెషన్-2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 షిఫ్టుల్లో జరుగుతాయని వెల్లడించారు.


